ETV Bharat / sitara

టీజర్​తో సుశాంత్.. ఫస్ట్​లుక్​తో మోహన్​బాబు - Ichata Vahanumulu Niluparadu teaser

సుశాంత్ హీరోగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే మోహన్​బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్​లుక్​ను ప్రేక్షకులతో పంచుకుంది చిత్రబృందం.

Ichata Vahanumulu Niluparadu teaser and Son of India first look released
టీజర్​తో సుశాంత్.. ఫస్ట్​లుక్​తో మోహన్​బాబు
author img

By

Published : Jan 29, 2021, 10:07 AM IST

Updated : Jan 29, 2021, 1:05 PM IST

సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. నూతన దర్శకుడు దర్శన్‌ తెరకెక్కిస్తున్నాడు. రవిశాస్త్రి, హరీష్‌ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న థ్రిల్లర్‌ చిత్రమిది. తాజాగా ఈ సినిమా టీజర్​ను నేడు (శుక్రవారం) విడుదల చేసింది చిత్రబృందం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డైలాగ్​ కింగ్​ మోహన్‌బాబు కథానాయకుడిగా.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం 'సన్‌ ఆఫ్‌ ఇండియా'. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత. తాజాగా సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. దేశభక్తి తన రక్తంలోనే ఉందంటూ రిలీజ్ చేసిన ఈ లుక్ అలరిస్తోంది.

ముంబయి ఉగ్రదాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమా 'మేజర్‌'. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈమేరకు జులై 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

Last Updated : Jan 29, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.