పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వకీల్‌సాబ్'. నివేదా థామస్, అంజలి, అనన్య కీలకపాత్రల్లో నటించారు. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ ఈ సినిమాతో తెరపై కనిపించారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్' గురించి నివేదా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు..
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
నివేదా: ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను. నా యోగక్షేమాలు అడిగినందుకు ధన్యవాదాలు.
పవన్‌కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
నివేదా: కమర్షియల్ హంగులు లేనప్పటికీ ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకొని ఇందులో భాగమైనందుకు పవన్ సర్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ కథ ఎంతోమందికి చేరువవుతుంది. ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఓ అద్భుత అనుభవాన్ని అందించింది.
వకీల్‌సాబ్‌లో మీకు నచ్చిన పాట?
నివేదా: మగువా మగువా
మీరు పోషించిన పాత్ర గురించి..?
నివేదా: ఇందులో నేను పల్లవి అనే సాధారణమైన అమ్మాయి పాత్ర పోషించాను. మిగతాది సినిమాలో చూడండి.
ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
నివేదా: 'పింక్' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన 'వకీల్‌సాబ్'లో భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. బాలీవుడ్లో ప్రేక్షకాదరణ మెండుగా పొందిన ఆ కథను తెలుగువారికి చేరువయ్యేలా తెరకెక్కించడాన్ని గొప్ప బాధ్యతగా భావించాం.
ఈ సినిమా షూటింగ్ డైరీస్‌లో మీకు గుర్తుండిపోయే ఓ విషయం?
నివేదా: ఒకటి కాదు ఎన్నో విశేషాలు ఉన్నాయి. కోర్టు రూమ్ సన్నివేశాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఇది మీ కెరీర్లో బెస్ట్ చిత్రమవుతుందని నమ్ముతున్నారా?
నివేదా: అవును.. తప్పకుండా అవుతుంది..
వేణుశ్రీరామ్ గురించి.. ?
నివేదా: ఆయనే మాకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని అందించారు. వేణుశ్రీరామ్కి ఓ పెద్ద హిట్ దక్కుతుంది.