అనిల్ కపూర్ నటిస్తున్న ఓ సినిమాపై భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన కొత్త సినిమా 'ఏకే వర్సెస్ ఏకే' ట్రైలర్లో తమ యూనిఫామ్‌ను తప్పుగా ధరించారని అసంతృప్తి చెందింది. ఆ సన్నివేశాలను తొలగించాలని చిత్రబృందానికి ట్విట్టర్ వేదికగా సూచించింది.
-
The IAF uniform in this video is inaccurately donned & the language used is inappropriate. This does not conform to the behavioural norms of those in the Armed Forces of India. The related scenes need to be withdrawn.@NetflixIndia @anuragkashyap72#AkvsAk https://t.co/F6PoyFtbuB
— Indian Air Force (@IAF_MCC) December 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The IAF uniform in this video is inaccurately donned & the language used is inappropriate. This does not conform to the behavioural norms of those in the Armed Forces of India. The related scenes need to be withdrawn.@NetflixIndia @anuragkashyap72#AkvsAk https://t.co/F6PoyFtbuB
— Indian Air Force (@IAF_MCC) December 9, 2020The IAF uniform in this video is inaccurately donned & the language used is inappropriate. This does not conform to the behavioural norms of those in the Armed Forces of India. The related scenes need to be withdrawn.@NetflixIndia @anuragkashyap72#AkvsAk https://t.co/F6PoyFtbuB
— Indian Air Force (@IAF_MCC) December 9, 2020
"ఈ వీడియోలో ఐఏఎఫ్ యూనిఫామ్‌ను తప్పుగా ధరించారు. వాళ్లు ఉపయోగించిన భాష కూడా సరిగ్గా లేదు. ఇది భారత సాయుధ దళాలలో ఉన్నవారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదు. సంబంధిత దృశ్యాలను తొలగించాలి."
--భారత వైమానిక దళం.
'ఏకే వర్సెస్ ఏకే' చిత్రానికి విక్రమాదిత్య, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ట్రైలర్లో ఐఏఎఫ్ యూనిఫామ్‌ను టక్ చేయకుండా అనిల్ కపూర్ కనిపించారు. ఒక సంభాషణలో ఆయన అభ్యంతరకర పదాలను వినియోగించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.