ETV Bharat / sitara

'ఆయన చెబితే సినిమాలకు గుడ్​బై చెబుతా!' - కాజల్​ గౌతమ్​ కిచ్లు

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన క్రేజ్​తో ఆకట్టుకున్న స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​. ప్రస్తుతం ఆమె పలు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవలే వివాహబంధంలో అడుగుపెట్టిన కాజల్​.. త్వరలోనే సినిమాలకు గుడ్​బై చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె​ స్పష్టత ఇచ్చింది.

I will quit acting whenever my husband asks me: Kajal Agarwal
'ఆయన చెబితే సినిమాలకు గుడ్​బై చెబుతా!'
author img

By

Published : May 20, 2021, 3:05 PM IST

అందంతో పాటు అభినయంతో టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతున్న హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్రకథానాయకులతో ఆమె సినిమాలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయితే.. ఇంత బిజీగా ఉన్న ఆమె సినిమాకు గుడ్‌ బై చెప్పబోతోందా..? అనే చర్చ కొంతకాలంగా టీటౌన్‌లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఏమైందంటే..

చాలా మంది హీరోయిన్లు పెళ్లయ్యాక దాదాపు సినిమాలకు దూరమవుతూ ఉంటారు. పెళ్లైన తర్వాత సినిమాలు చేసేందుకు మనసు ఒప్పక కొంతమంది.. వ్యక్తిగత కారణాలతో మరి కొంతమంది సినిమాకు వీడ్కోలు చెప్తారు. అయితే.. ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ కూడా ఆ జాబితాలో చేరబోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె గతేడాది అక్టోబర్‌ 30న వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం తర్వాత సినిమాలు చేస్తుందా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది.

అయితే.. ఇటీవలే ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్‌ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం తాను సినిమాలు చేసేందుకు తన కుటుంబం నుంచి మద్దతు లభిస్తోందని.. ఒకవేళ తన భర్త గౌతమ్‌ వద్దంటే సినిమాలకు గుడ్‌బై చెప్తానని ఆమె చెప్పింది. అంటే కాజల్‌కు ఇప్పట్లో సినిమాలు వదిలేసే ఆలోచన లేదని అర్థమవుతోంది. ఆమె ప్రస్తుతం ఆమె తెలుగులో 'ఆచార్య'తో పాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో కనిపించనుంది. మరో ఐదు తమిళ సినిమాలకు ఆమె సంతకం చేసింది.

ఇదీ చూడండి.. నాకు హెచ్​ఐవీ: నటుడి సంచలన ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.