కరోనా లాక్డౌన్లో వలస కార్మికులకు సహాయం చేసిన నటుడు సోనూసూద్‌పై ప్రజల్లో మరింత గౌరవం పెరిగింది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం వల్ల అతడిని నెగటివ్ రోల్స్‌లో ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇకపై తాను విలన్ పాత్రలు చేయనని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సోనూ. "ప్రస్తుతం నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో చేయాల్సిన సమయం నాకుంది" అని ఆయన తెలిపారు.
లీడ్రోల్లో సోనూ!
బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. బంగాల్లో మోటార్ బైక్‌పై రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లే కరీముల్ హక్ జీవితాధారంగా 'బైక్ అంబులెన్స్ దాదా' రూపొందించనున్నారు. ఇందులో టైటిల్ రోల్లో సోనూ నటించే అవకాశం ఉంది.
ఈ-రిక్షాల పంపిణీ
కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ ఇటీవలే ఓ సరికొత్త ప్రణాళికలను రూపొందించారు. అవసరమైన వారికి ఈ-రిక్షాలను అందించి వారితో కొత్త వ్యాపారం చేసేలా సోనూ ప్రోత్సహిస్తున్నారు.
'ఖుద్ కమావో ఘర్ చలావో' పేరుతో ఓ విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టిన నటుడు సోనూసూద్.. ప్రజలకు ఉపాధి అవకాశమే కల్పించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. "అవసరమైన సామాగ్రిని అందించడం కంటే ఉద్యోగ అవకాశాలను అందించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నా. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలు వారి కాళ్లపై వారు నిలబడడానికి అది సహాయపడుతుందని భావిస్తున్నా" అని సోనూసూద్ అన్నారు.
ఉద్యోగం కోసం ప్రత్యేక యాప్
కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఇదివరకే 'ప్రవాసీ రోజ్‌ఘర్' అనే యాప్‌ను సోనూసూద్ ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వారిలో నైపుణ్యాలను వృద్ధి చేయడం సహా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు సోనూ ప్రకటించారు.
ఇదీ చూడండి: అభిమాని 'లీఫ్ ఆర్ట్'కు సోనూ సర్ప్రైజ్