బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాదక ద్రవ్యాలు తీసుకుందంటూ ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఈ విషయంపై కంగన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో.. తాను డ్రగ్స్‌కు బానిసైనట్లు కంగన అందులో పేర్కొంది.
కంగన 16 ఏళ్ల వయసున్నప్పుడు నటి కావాలన్న ఆకాంక్షతో ముంబయి చేరుకుంది. చాలా తక్కువ సమయంలోనే అనేక ఒడుదొడుకులను తట్టుకుని బాలీవుడ్ స్టార్ అయింది. అయితే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత మంది తనకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మత్తు పదార్థాలకు బానిస చేసినట్లు కంగన ఆరోపించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల కోణం బయటపడిన నేపథ్యంలో.. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపైనా స్పందించింది కంగన. నటులు రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌషల్, దర్శకుడు అయాన్ ముఖర్జీలను డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.