ETV Bharat / sitara

'రణ్​వీర్​లో నచ్చిన విషయమదే.. అందుకే పెళ్లి చేసుకున్నా' - దీపికా పదుకొణె రణ్​వీర్ సింగ్

బాలీవుడ్​లో స్టార్​ కపుల్​గా పేరుతెచ్చుకుంది రణ్​వీర్-దీపిక జోడీ. అయితే తాను రణ్​వీర్​ను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది దీపిక.

Ranveer Deepika
రణ్​వీర్ దీపిక
author img

By

Published : Feb 1, 2021, 7:44 AM IST

రణ్‌వీర్‌-దీపిక.. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుందీ జోడీ. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'రామ్‌లీలా' చిత్రీకరణలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరూ అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల డేటింగ్‌ తర్వాత ఈ జంట 2018లో నవంబర్‌ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా, రణ్‌వీర్‌ను వివాహం చేసుకోడానికి గల కారణం గురించి ఇటీవల దీపికా పదుకొణె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఫేమ్‌, సంపాదనపరంగా రణ్‌వీర్‌ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేవాడని.. ఒకేవిధంగా గౌరవించేవాడని.. అదే ఏడడుగుల బంధంలోకి వెళ్లేలా చేసిందని.. ఆమె తెలిపింది.

"మొదటి నుంచి నా విజయాన్ని, సంపాదనను రణ్‌వీర్‌ ఎంతో గౌరవించాడు. ఇప్పుడు తాను కూడా స్టార్‌డమ్‌, ఫేమ్‌ పొందుతున్నాడు. కానీ ఏడేళ్ల క్రితం ఇవేమీ లేవు. అతను పరిచయమయ్యే సమయానికి నేను సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఉన్నాను. వరుస సినిమా షూట్స్‌తో చాలా బిజీగా గడిపేదాన్ని. కొన్నిసార్లు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. వరుస సినిమాల వల్ల నా సంపాదన కూడా ఎక్కువగానే ఉండేది. కానీ, మా ఇద్దరి మధ్య ఈ విషయాలేవీ వచ్చేవి కాదు. తను నన్ను అంతలా గౌరవించాడు. అలా మా బంధం మరింత బలపడింది. మేము ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టగలిగాం" అని దీపిక వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.