ETV Bharat / sitara

గర్వంగా కియారా.. నవ్వించేందుకు శ్రీవిష్ణు

వీర జవాన్‌ కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా జీవిత కథతో తెరకెక్కిన 'షేర్షా' సినిమాలో నటించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపింది హీరోయిన్​ కియారా అడ్వాణీ. కాగా, తాను నటించిన 'రాజ రాజ చోర' కచ్చితంగా వినోదాన్ని పంచే చిత్రమని అన్నాడు నటుడు శ్రీవిష్ణు.

kiara
కియారా
author img

By

Published : Aug 12, 2021, 7:24 AM IST

డింపుల్‌ చీమాగా తెరపై కనిపించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను అంటోంది కియారా అడ్వాణీ. సిద్ధార్థ్‌ మల్హోత్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'షేర్షా'. వీర జవాన్‌ కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా జీవిత కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విక్రమ్‌ ప్రియురాలు డింపుల్‌ చీమా పాత్రలో నటించింది కియారా. ఈ చిత్రం గురువారం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ "ఈ సినిమా కోసం డింపుల్‌ను కలవడం ఈ సినిమా ప్రయాణంలో ఎంతో కీలకమైన ఘట్టం. ఆమెను కలిశాక తెరపై పాత్రలో ఎలా ఒదిగిపోవాలో అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్‌ చూశాకా డింపుల్‌ చాలా సంతోషించారని తెలిసి ఆనందపడ్డా. విక్రమ్‌తో తన ప్రేమ కథను డింపుల్‌ చక్కగా చెప్పారు కాబట్టే ఆమె పాత్రలో భావోద్వేగాలను పలికించగలిగా. విక్రమ్‌ బత్రా భౌతికంగా లేకపోయినా మానసికంగా ఇంకా ఆమెతోనే ఉన్నారు. ప్రేమ కోసం మరెవరినీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె చాలా గొప్ప ప్రేమికురాలు" అని చెప్పింది కియారా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నవ్వించేందుకు

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. మేఘ ఆకాష్‌ కథానాయిక. సునైన ముఖ్యభూమిక పోషించారు. హితేశ్‌ గోలి దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "హాయిగా నవ్వించే మంచి సినిమాల్ని చూడాలనేది ప్రేక్షకుల కోరిక. కచ్చితంగా వినోదాన్ని పంచే చిత్రం మా 'రాజ రాజ చోర'. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది" అని చిత్రబృందం. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తదితరులు ఇందులో నటించారు.

ఇదీ చూడండి: 11 రూపాయలకే​ సినిమా చేసిన స్టార్ హీరోయిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.