'ప్రస్థానం' లాంటి సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు దేవా కట్టా.. ఆ తర్వాత ఆ స్థాయిలో చిత్రాలు తీయలేకపోయారు. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' లాంటి సినిమాలు తీసినా సరే అవి ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టులేకపోయాయి. ఇప్పుడు 'రిపబ్లిక్'(sai tej republic) అంటూ అక్టోబరు 1న థియేటర్లలోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"ప్రస్తుతం నా దగ్గర 6-7 కథలు ఉన్నాయి. ఇవన్నీ కొత్త పాయింట్లు. 'రిపబ్లిక్' రిలీజ్ అయిన మూడు నెలలకు కొత్త సినిమా మొదలుపెడతా. ఓటీటీకి ఆదరణ పెరుగుతున్నా సరే నేను మాత్రం థియేటర్లలో చూసేందుకు ఇష్టపడతా. రాబోయే 4-5 ఏళ్లు వరుసగా సినిమాలు చేస్తా. ప్రస్తుతం నా దగ్గర రెండు అద్భుతమైన స్టోరీలు ఉన్నాయి. ఆ రెండు కథలు సినిమాగా తీయకపోతే నా బతుక్కి అర్థం ఉండదు. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే ఓటీటీలో డైరెక్షన్ గురించి ఆలోచిస్తా" అని దేవా కట్టా చెప్పారు.
అలానే 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య' లాంటి జానర్లో సినిమాలు చేయడం ఇకపై ఆపేయాలని అనుకుంటున్నట్లు దేవా కట్టా తెలిపారు. 'రిపబ్లిక్'(deva katta new movie) క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని, అందువల్లే సాయితేజ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారని ఈ డైరెక్టర్ వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: