ETV Bharat / sitara

'లాక్​డౌన్ వల్ల ఆర్థికంగా నాకూ ఇబ్బందులే'

టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ అవకాశాలతో దూసుకెళ్తోంది నటి శ్రుతి హాసన్. తాజాగా లాక్​డౌన్​పై స్పందించిన ఈమె తాను కూడా కొంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపింది.

Shruthi Hassan
శ్రుతి హాసన్
author img

By

Published : May 12, 2021, 2:12 PM IST

స్టార్‌హీరో కుమార్తెగా వెండితెరకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్‌. అటు గాయనిగానూ ఫిదా చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడం వల్ల ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా దేశంలో ఉన్న పరిస్థితుల గురించి స్పందించింది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా తాను కూడా ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపింది. తన ఆలోచనలకు గౌరవం ఇచ్చే అమ్మానాన్న కూడా ఈ విషయంలో సాయం చేయరని వెల్లడించింది.

"ఇటీవల నేను సొంతంగా ఓ ఇంటిని కొనుగోలు చేశా. దాంతో ప్రతినెలా నేను సంపాదించిన దానిలో కొంత ఈఎంఐ కడుతున్నా. కానీ ఇప్పుడు అనుకోకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల షూటింగ్స్‌, నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాకు వేరే వాళ్లపై ఆధారపడడం ఇష్టం ఉండదు. నేను స్వతంత్ర భావాలున్న మహిళను. దానివల్ల అమ్మానాన్న కూడా నాకు సాయం చేయరు. నాకూ వాళ్ల సాయం పొందడం ఇష్టం లేదు. పరిస్థితులన్నీ చక్కబడి మళ్లీ సాధారణ రోజులు రావాలని కోరుకుంటున్నా. ఒకవేళ షూటింగ్స్‌ కనుక ప్రారంభిస్తే వెంటనే నేను సెట్‌లో వాలిపోతా. ఎందుకంటే అలా అయినా కొంతవరకూ ఆర్థికంగా నిలదొక్కుకుంటా" అని శ్రుతిహాసన్‌ వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.