ETV Bharat / sitara

అందరూ మెచ్చిన సెలబ్రిటీలు వీరు - హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌

2019 గానూ 'హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌' జాబితా విడుదలైంది. ఇందులో సమంత అగ్రస్థానం సంపాదించగా.. ఫెమినా మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచిన సంజనా విజ్‌ రెండో స్థానం దక్కించుకుంది.

సెలిబ్రిటీలు
సెలిబ్రిటీలు
author img

By

Published : Mar 17, 2020, 9:18 PM IST

Updated : Mar 18, 2020, 11:08 AM IST

అందం, నైపుణ్యం.. దీనికి తోడు కొంచెం స్మార్ట్‌నెస్‌ కలిసిన సెలబ్రిటీలు వీరు. ప్రజలు వీరి ప్రతిభను మెచ్చి, ఓట్లు వేసేలా చేశారు. 2019 'హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌' జాబితాను విడుదల చేశారు. బ్యూటీ సమంత ఈ ఏడాది అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. 2018లో ఆమె ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. 2017లో 21 స్థానంలో ఉంది. మూడేళ్లలో ఆమె ఈ ఖ్యాతిని దక్కించుకోవడం అభినందించాల్సిన విషయం. గతేడాది 'మజిలి', 'ఓ బేబీ', 'సూపర్‌ డీలక్స్‌' సినిమాలతో సామ్ అలరించింది.

Hyderabad times
సమంత

ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ 2019 కిరీటం గెలుచుకుని.. ఫెమినా మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచిన సంజనా విజ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.

Hyderabad times
సంజనా విజ్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు మూడో స్థానం సొంతం చేసుకుంది. ఆమె 2018లో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.

సింధు
సింధు

గతేడాది ‘హైదరాబాద్ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కథానాయిక అదితిరావు హైదరి ఈ సారి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో ఆమె నటించిన 'పద్మావత్‌', 'సమ్మోహనం' సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ఆమె నటించిన 'వి' సినిమా విడుదల కాబోతోంది.

Hyderabad times
అదితి రావు

కథానాయిక పూజా హెగ్డే ఐదో స్థానం దక్కించుకుంది. గతేడాది ఈ బుట్టబొమ్మ 'మహర్షి', 'గద్దలకొండ గణేష్‌' సినిమాలతో తెలుగు వారిని అలరించింది. ఆమె హిందీలో నటించిన 'హౌస్‌ఫుల్‌ 4' సూపర్‌హిట్‌ అందుకుంది. పూజా 2018లో నాలుగో స్థానంలో ఉంది.

Hyderabad times
పూజా హెగ్డే

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సారి ఏడో స్థానం దక్కించుకుంది. ఆమె 2019లో 'దేవ్‌', 'దే దే ప్యార్‌ దే', 'ఎన్జీకే', 'మన్మథుడు 2' వంటి సినిమాలతో అలరించింది. రకుల్‌ గతేడాది ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.

Hyderabad times
రకుల్ ప్రీత్

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది పదో స్థానంలో ఉన్న ఆమె కాస్త ముందుకొచ్చింది. కాజల్‌ నటించిన 'సీత', 'రణరంగం', 'కోమలి' సినిమాలు 2019లో విడుదలయ్యాయి.

Hyderabad times
కాజల్

'ఛలో'తో టాలీవుడ్‌కు వచ్చిన రష్మిక ఈసారి 'హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌' జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో ఐదో స్థానంలో ఉన్న ఆమె ఈసారి నాలుగు అంకెలు కిందికి వచ్చేసింది. రష్మిక 'డియర్‌ కామ్రేడ్‌'తో 2019లో ప్రేక్షకుల్ని అలరించింది.

సింధు
రష్మిక

ఇదే జాబితాలో చిత్ర పరిశ్రమకు చెందిన నిధి అగర్వాల్‌ 11వ స్థానంలో, కియారా అడ్వాణీ 12, రాశీ ఖన్నా 15, ఈషా రెబ్బా 16, పాయల్‌ రాజ్‌పుత్‌ 17, కీర్తి సురేశ్‌ 20, అనుపమ పరమేశ్వరన్‌ 21, తమన్నా 22, సాయిపల్లవి 23, శ్రీముఖి 25, అదా శర్మ 26, రెజీనా 28 స్థానాల్లో నిలిచారు.

Last Updated : Mar 18, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.