కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు నిఖిల్.. కొవిడ్ బాధితుడికి మందులు అందించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్ ఓ ట్వీట్ పెట్టారు.
-
Dear sir, please share your location, we will inform the concerned/local staff, to get it resolved. Thank you.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear sir, please share your location, we will inform the concerned/local staff, to get it resolved. Thank you.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 23, 2021Dear sir, please share your location, we will inform the concerned/local staff, to get it resolved. Thank you.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 23, 2021
"కొవిడ్ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్ నుంచి కిమ్స్ మినిస్టర్స్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారును ఆపేశారు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించనప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. ఈ-పాస్ ఉండాల్సిందే అని చెప్పేశారు. అప్పటికీ నేను తొమ్మిదిసార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్ కావడం వల్ల నాకు ఈ పాస్ దొరకలేదు. దాంతో మెడికల్ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. వచ్చాను."
- నిఖిల్ సిద్ధార్థ్, యువ కథానాయకుడు
నిఖిల్ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం.. "సార్, మీ లొకేషన్ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం" అని రిప్లై ఇచ్చింది.
ఇదీ చూడండి.. బోనీ కపూర్‌కు కన్నీళ్లు మిగిల్చిన తుపాను