ETV Bharat / sitara

'మా ఫలితాలు వచ్చాయటగా'.. కంగనకు తాప్సీ చురక - కంగనాకు తాప్సీ చురక

బాలీవుడ్​లో బంధుప్రీతి గురించి ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది కంగనా రనౌత్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ వారసత్వం లేకున్నా బాలీవుడ్​లో రాణిస్తోన్న తాప్సీ, స్వర భాస్కర్​ను బీ గ్రేడ్ హీరోయిన్లుగా అభివర్ణించింది. దీనిపై తాప్సీ, స్వర భాస్కర్ స్పందించారు.

'మా ఫలితాలు వచ్చాయటగా'.. కంగనకు తాప్సీ చురక

author img

By

Published : Jul 19, 2020, 8:04 PM IST

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌.. తాప్సీల మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా బంధుప్రీతి విషయంలో వీరిద్దరి ఆలోచనలు, భావాలు వేరుగా ఉన్నాయి. దీంతో కంగన ఓ కామెంట్‌ చేస్తే.. దానికి తాప్సీ పరోక్షంగా మరో కామెంట్‌ చేస్తూ వస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. సినీ నేపథ్యం లేకున్నా బాలీవుడ్‌లో రాణిస్తున్న తాప్సీ, స్వర భాస్కర్‌ను బీ-గ్రేడ్‌ హీరోయిన్లుగా అభివర్ణించింది. ఆలియా భట్‌, అనన్య పాండే కన్నా మంచి నటులైన తాప్సీ, స్వర భాస్కర్‌ ఎందుకు ఫేమస్‌ కాలేకపోతున్నారని ప్రశ్నించింది. కంగన చేసిన వ్యాఖ్యలపై తాప్సీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. సినీ పరిశ్రమలో గ్రేడ్ల విధానం వాస్తవమేనా అని సందేహం వ్యక్తం చేసింది.

  • Maine suna class 12th n 10th ke result ke baad humaara result bhi aa gaya hai! Humaara grade system ab official hai ? Abhi tak toh number system pe value decide hoti thi na 🤔 #MaLifeMaRulesMaShitMaPot

    — taapsee pannu (@taapsee) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇటీవల పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత మా ఫలితాలు కూడా వచ్చాయని విన్నా. ఇప్పుడు గ్రేడ్ల విధానం అధికారికంగా మారిందా? ఇప్పటి వరకు నెంబర్‌ విధానంలోనే వ్యక్తుల విలువ లెక్కగట్టేవారు కదా?"

-తాప్సీ, నటి

స్వర భాస్కర్‌ కూడా కంగన వ్యాఖ్యలపై స్పందిస్తూ "ఆలియా భట్‌, అనన్య కంటే మేం మంచి నటులమని చెప్పారు. దీనిని నేను ప్రశంసగా భావిస్తా. థాంక్యూ కంగన! మీరు చాలా అందమైన, తెలివైన గొప్ప నటి. అలాగే వెలుగొందుతూ ఉండు"అని ట్వీట్‌ చేసింది.

లాక్‌డౌన్‌కు ముందు 'తప్పడ్‌' చిత్రంతో మెప్పించిన తాప్సీ ప్రస్తుతం 'హసీన్‌ దిల్‌రుబా'.. ‘'జన గణ మన' చిత్రాల్లో నటిస్తోంది. స్వర భాస్కర్‌ వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. రెండేళ్ల విరామం తర్వాత 'షీర్‌ కుర్మా’' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.