ETV Bharat / sitara

హృతిక్​ 'క్రిష్​ 4' సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే! - హృతిక్​ రోషన్ క్రిష్​ 4

Hrithikroshan Krish 4 shooting: హృతిక్​రోషన్​ నటించనున్న 'క్రిష్​ 4' షూటింగ్​.. ఈ ఏడాది జూన్​లో ప్రారంభంకానుందని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందట!

HrithikRoshan Krish 4
హృతిక్​ 'క్రిష్​ 4
author img

By

Published : Mar 14, 2022, 10:58 AM IST

Hrithikroshan Krish 4 shooting: బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'క్రిష్‌' సిరీస్‌ చిత్రాలకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో నాలుగో చిత్రంగా 'క్రిష్‌ 4' తెరకెక్కించనున్నట్టు దర్శకనిర్మాత రాకేష్‌ రోషన్‌ ఇప్పటికే ప్రకటించారు. సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలోనే కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడిందీ చిత్రం. అయితే ఇప్పుడీ చిత్రాన్ని సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది జూన్​లో సినిమా చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని ఓ సినిమా ప్రతినిధి తెలిపారు. "క్రిష్​ 4కు సన్నాహాలు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ ఏడాది జూన్​లో షూటింగ్​ ప్రారంభిస్తాం"అని సదరు ప్రతినిధి అన్నారు.

'టైమ్‌ ట్రావెల్‌' కథాంశంతో 'క్రిష్​ 4' సాగనుందని సమాచారం. ఈ సిరీస్​లో భాగంగా తొలి సినిమా అయినా 'కోయీ మిల్​గయా' చిత్రంలో గ్రహాంతర వాసి జాదూ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ జాదూ సాయంతోనే తన తండ్రి రోహిత్​ మెహ్రాను కాపాడటమే ఈ సినిమా కథాంశమని సమాచారం. ​కాగా, హృతిక్​ ప్రస్తుతం 'ఫైటర్'​, 'విక్రమ్​ వేదా' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్​ సినిమాతో మళ్లీ తెరపైకి సోనాలీ బింద్రే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.