ETV Bharat / sitara

ఆ డాక్టర్​ స్టెప్పులకు హృతిక్​ ఫిదా - అస్సామీ డాక్టర్​ డాన్స్​ వీడియో

అసోంకు చెందిన డాక్టర్​ అరుప్​ సేనాపతి.. పీపీఈ కిట్​ ధరించి చేసిన డాన్స్​ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఆ వీడియోకు ఫిదా అయిన హృతిక్​ రోషన్​.. వైద్యుడు వేసిన స్టెప్పులను నేర్చుకోవాలనుకుంటున్నట్లు రీట్వీట్​ చేశాడు.

Hrithik to learn dance step from Assamese doctor ! Videos go Viral
'ఏదో ఒకరోజు ఆ డాక్టర్​లా స్టెప్పులు వేస్తా'
author img

By

Published : Oct 20, 2020, 9:54 AM IST

అసోంలోని ఓ ఆసుపత్రిలో కరోనా వార్డులో విధులు నిర్వహిస్తున్న డాక్టర్​ అరుప్​ సేనాపతి చేసిన డాన్స్​ వీడియో వైరల్​గా మారింది. అతడు పీపీఈ కిట్​ ధరించి.. హృతిక్​ రోషన్​ నటించిన 'వార్​' చిత్రంలోని ఘుంగ్రూ పాటకు డాన్స్​ చేశాడు. ఆ వీడియోకు నెటిజన్లతో పాటు హీరో హృతిక్​ రోషన్​ కూడా ఫిదా అయ్యాడు.

  • Tell Dr Arup I’m gonna learn his steps and dance as good as him someday in Assam . Terrific spirit . 🕺🏻 https://t.co/AdBCarfCYO

    — Hrithik Roshan (@iHrithik) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిల్చార్​ మెడికల్​ కాలేజీకి చెందిన ఈఎన్​టి స్పెషలిస్టు డాక్టర్​ సేనాపతి సహోద్యోగి డాక్టర్​ సయీద్​ ఫైజన్​ అహ్మద్​ ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. దీనిపై స్పందించిన నటుడు హృతిక్​ రోషన్​.. ఆ వైద్యుడు వేసిన స్టెప్పులను తాను నేర్చుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు.

"డాక్టర్​ అరుప్​కు చెప్పండి. నేను అతడు వేసిన స్టెప్పులను నేర్చుకుని.. అసోంలో ఏదో ఒకరోజు అతడిలాగే డాన్స్​ చేస్తా. అద్భుతమైన స్ఫూర్తి," అని హృతిక్​ రోషన్​ రీట్వీట్​ చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.