బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ పరంగా భారత్‌లో ఏంతోమంది యువతకు హృతిక్ ఆదర్శం. ఎలాంటి స్టెప్పులైనా అలవోకగా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు తాజాగా మరో డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు హృతిక్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రముఖులు కామెంట్లు..
'మంగళవారాల్లో ఎలాంటి కారణం లేకుండా డ్యాన్స్ చేసేవారి మధ్యలో ఉండాలని ఉంది' అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో హృతిక్ ఫేస్ కనిపించలేదు. టీషర్ట్, షూస్ ధరించి డ్యాన్స్‌ను ఆస్వాదిస్తున్నట్లుగా ఈ వీడియో ఉంది. హృతిక్ పోస్టుపై టైగర్ ష్రాఫ్, జోయా అక్తర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కామెంట్లు చేశారు.
ప్రస్తుతం హృతిక్.. సిద్ధార్ ఆనంద్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే.. తమిళ బ్లాక్ బస్టర్ 'విక్రమ్ వేదా' హిందీ రీమేక్‌లో సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించనున్నాడు హృతిక్.
ఇదీ చదవండి: 'తుఫాన్'తో నెరవేరిన ఫర్హాన్ కల!