సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth new movie) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయనను.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ(dada saheb phalke award 2021) కేంద్రం ఇటీవల సత్కరించింది. దానిని తన మిత్రుడు రాజ్ బహదూర్‌కు(raj bahadur rajinikanth friend) అంకితమిస్తున్నట్లు రజనీ చెప్పారు. అయితే వీరిద్దరి స్నేహం ఎప్పటి నుంచి ఉంది? అసలు రజనీకి సినిమాల్లో తొలుత ఎలా అవకాశం వచ్చింది?
తన స్నేహితుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు(dadasaheb phalke award winners) వచ్చిన తర్వాత 'ఈటీవీ భారత్'.. రాజ్ బహదూర్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా తామిద్దరి 50 ఏళ్ల స్నేహం, రజనీకి తొలి సినిమా అవకాశం రావడం గురించి ఆయన చెప్పారు.
"రజనీకాంత్(rajinikanth movies) మాతో కలిసి కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో మేమంతా నాటకాలు వేసేవాళ్లం. రజనీ లీడ్ రోల్లో చాలా బాగా నటించేవాడు. అతడి ప్రతిభ చూసి, సినిమాల్లోకి వెళ్లమని చెప్పాను. అందులో ప్రయత్నిస్తే గొప్ప నటుడివి అవుతావని అన్నాను. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని చెప్పాను. దీంతో అక్కడ రెండేళ్లపాటు రజనీ శిక్షణ తీసుకున్నాడు. మొత్తం కోర్సు పూర్తయిన తర్వాత వాళ్లు ఓ నాటకం వేశారు. దానికి చూసేందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు బాలచందర్(balachander movies).. రజనీ నటనకు ముగ్దుడయ్యారు. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అప్పటినుంచి రజనీ, నేను.. తమిళంలో మాట్లాడటం మొదలుపెట్టాం. రెండునెలల్లోనే రజనీ.. తమిళం పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత బాలచందర్ దగ్గరకు వెళ్లగా, తాను తీయబోయే 'అపూర్వ రాగంగళ్'లో రజనీకి అవకాశమిస్తున్నట్లు ఆయన చెప్పారు" అని రాజ్ బహదూర్ చెప్పారు.
సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కండక్టర్‌గా(rajinikanth bus conductor) రజనీ పనిచేశారు. ఆ బస్సుకు రాజ్ బహదూర్ డ్రైవర్. అప్పుడు మొదలైవ వీరి స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతోంది. బెంగళూరు ఎప్పుడొచ్చినా, రజనీ.. రాజ్ బహదూర్‌ను కచ్చితంగా కలుస్తారు.
ఇవీ చదవండి: