కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో 'మైనే ప్యార్ కియా' సినిమాలో నటించిన భాగ్యశ్రీ.. ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా కనిపించి, ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. అయితే టాలీవుడ్లోకి ఆమె రీఎంట్రీ ఇవ్వనుందని, ప్రభాస్‌కు తల్లిగా కనిపించనుందనే వార్త ఆసక్తి పెంచుతోంది.
పీరియాడిక్ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే సంవత్సరం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చదవండి: మైమరిపిస్తున్న పాయల్ అందాలు