కరోనా ప్రభావంతో ఇకపై రానున్న సినిమాల్లో ముద్దు, శృంగార సన్నివేశాల విషయంలో దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హీరో ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర్శక్తి ఖురానా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నవ్విస్తూనే ఆలోచింపజేస్తోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రొమాన్స్‌కు 'ఫేస్‌షీల్డ్'!
అపర్శక్తి తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా 'హెల్మెట్'. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రనూతన్ కళ్లలోకి చూస్తూ, మంచంపై ఉన్న స్టిల్‌ను పంచుకున్నాడు అపర్శక్తి. దీనితో పాటే తామిద్దరి ముఖాలకు 'ఫేస్ షీల్డ్' ఎడిటింగ్ చేసిన మరో ఫొటోను పోస్ట్ చేశాడు. "హమ్మయ్యా మా సినిమా షూటింగ్ కరోనా రాకముందు జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని చిత్రీకరించాలంటే ఫేస్ షీల్డ్ తప్పనిసరేమో!" అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం చంఢీగడ్‌లో కుటుంబంతో ఉన్న అపర్శక్తి.. పాటలు పాడుతూ అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. దీనితో పాటే 'తేరీ యారీ' అనే గీతం కోసం మిలింద్ గబా, కింగ్ కాజీలతో కలిసి పనిచేశాడు.
ఇవీ చదవండి: