ETV Bharat / sitara

అందమైన భామలు మెచ్చే హ్యాండ్​బ్యాగులు - తాప్సీ

సినీతారలు వాడే ఏ వస్తువైనా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. హీరోలు అయితే బ్రాండెడ్​ షర్టులు, జీన్స్​.. హీరోయిన్లు అయితే డిజైనింగ్​ డ్రస్​లు, హెయిర్​స్టైల్స్​, హ్యాండ్​బ్యాగ్స్​ వంటివే కాకుండా వారు వాడే కార్లనూ అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు. నటీమణులకు హ్యాండ్​బ్యాగ్​ ఎంతో అవసరం. విదేశాల్లో షూటింగ్​కు వెళ్లినప్పుడు వారికి కావాల్సిన వస్తువులను అందులో ఉంచుతారు. మరి టాలీవుడ్​ స్టార్​ కథానాయికలు బ్యాగులను ఏవిధంగా వాడుతారో తెలుసుకుందామా..

Heroins-with-Handbags
అందమైన భామలు మెచ్చే హ్యండ్​బ్యాగులు
author img

By

Published : Feb 16, 2020, 7:47 AM IST

Updated : Mar 1, 2020, 12:04 PM IST

ఫ్యాషన్‌ ప్రపంచం మొత్తం సినిమా రంగం చుట్టూనే తిరుగుతుంటుంది. వాళ్లు వాడే దుస్తులు, ధరించే ఆభరణాలు, తిరిగే కార్లు... అన్నింటిపై అభిమానుల చూపు ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపించడం, లుక్‌తోనే ఆకర్షించడం సినీ తారల జన్మహక్కుగా మారింది. నాయికలైతే ముస్తాబుతోనే మతులు పోగొట్టేస్తారు. ముఖ్యంగా కథానాయికల బ్యాగులు భలే ఉంటాయి. దుస్తుల రంగులకు తగినట్టు, ఇప్పటి ట్రెండ్‌కి అద్దం పట్టినట్లు ఖరీదైన బ్యాగులతో తళుక్కుమంటుంటారు. మరి ఆ బ్యాగులంటే వాళ్లకెంత ఇష్టం? అందులో ఏముంటాయి? వీటిపై ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

అందరిలానే నేనూ...

"అమ్మాయిల ఫ్యాషన్‌ ప్రపంచంలో హ్యాండ్‌ బ్యాగులే ఫస్ట్‌. మొన్నీమధ్యే ఓ ఖరీదైన బ్యాగుని కొన్నా. అందరి అమ్మాయిల హ్యాండ్‌ బ్యాగులో ఏముంటాయో, అవే నా బ్యాగులోనూ ఉంటాయి. కాకపోతే కాస్త ఎక్కువగా. సెట్‌కి మాత్రం హ్యాండ్‌ బ్యాగుని తీసుకెళ్లను. బయట షాపింగులకు వెళ్లేప్పుడే పట్టుకెళ్తా. నేను ఫ్రెండ్స్‌కి ఇచ్చే కానుకల్లో హ్యాండ్‌ బ్యాగులే ఎక్కువ".

- సమంత

Heroins-with-Handbags
సమంత

అదే ఖరీదైనది

"షూటింగుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఏదో ఒకటి కొంటుంటా. వాటిలో హ్యాండ్‌ బ్యాగులే ఎక్కువగా ఉంటాయి. మొన్న పారిస్‌ వెళ్లినప్పుడు అక్కడో బ్యాగు తీసుకున్నా. ఇప్పటి వరకూ కొన్న వాటిలో ఖరీదైనది అదే. నా బ్యాగులో క్రెడిట్‌ కార్డులు, కొంత డబ్బు, ఇయర్‌ ఫోన్స్‌ ఉండాల్సిందే. లిప్‌బామ్‌, పెర్‌ఫ్యూమ్స్‌, చాక్లెట్స్‌.. ఇలా చాలానే కనిపిస్తాయి. చిన్న చిన్న పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లూ, మేకప్‌ కిట్లు కొంటుంటా. ఎందుకంటే అవన్నీ ఎంచక్కా బ్యాగులో పట్టేస్తాయి. కాంటాక్ట్‌ లెన్స్‌, కూలింగ్‌ గ్లాసులు కూడా తప్పనిసరిగా ఉంటాయి".

- తమన్నా

Heroins-with-Handbags
తమన్నా

అప్పట్లో నాలుగు వేలే!

"నా బ్యాగులో ఓ మినీ ప్రపంచమే ఉంటుంది. షూటింగుల్లో ఎప్పుడు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. అందుకే కావల్సినవన్నీ హ్యాండ్‌ బ్యాగులో సర్దేసుకుంటా. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌, పవర్‌ బ్యాంక్‌, కొన్ని డబ్బులు తప్పని సరిగా బ్యాగులో ఉంటాయి. ఇంకా లిప్‌బామ్‌, గాగుల్స్‌, గ్రీన్‌టీ ప్యాకెట్లు, కొన్ని క్రీములు, కను రెప్పలకు అందాన్ని తీసుకొచ్చే షేడ్స్‌ అందులో ఉంచుతాను. మౌత్‌ ఫ్రెష్‌నెర్‌ అస్సలు మర్చిపోను. డ్రైఫూట్స్‌ డబ్బా బ్యాగులో ఉండాల్సిందే. కాలేజీ రోజుల్లో రూ.4 వేలతో ఓ బ్యాగు కొన్నా. అప్పుడు నాలుగు వేలంటే ఎక్కువ. పైగా నా సంపాదనతోనే కొనుక్కున్నా. ఇప్పుడంటారా... కేవలం బ్యాగుల కోసమే వేలకు వేలు ఖర్చుచేస్తున్నా".

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌

Heroins-with-Handbags
రకుల్​ప్రీత్​ సింగ్​

రాసుకోవడానికి ఓ పెన్ను...

"పెద్ద పెద్ద బ్యాగులు నాకెప్పుడూ ఇష్టం ఉండదు. హ్యాండ్‌బ్యాగ్‌ ఎంత సింపుల్‌గా ఉంటే అంత బాగుంటుంది. అందులోనూ ముఖ్యమైన వస్తువులే ఉంటాయి. ఓ పెన్‌ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే.. అప్పుడప్పుడూ నాకు విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పేపర్‌పై పెట్టేస్తుంటా. స్క్రిప్టుని చదువుకుంటూ నాకు అనుమానం వచ్చిన చోట మార్క్‌ చేస్తుంటా. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి ఓ క్రీమ్‌, సెల్‌ఫోన్‌, ఛార్జర్‌, కొన్ని డబ్బులు, ఇంటి తాళాలూ తప్పకుండా ఉంటాయి".

- తాప్సీ

Heroins-with-Handbags
తాప్సీ

పుస్తకానికీ చోటు

"నాతో ఎప్పుడూ రెండు హ్యాండ్‌ బ్యాగులు ఉంటాయి. ఒకటి కేవలం మేకప్‌ కిట్‌కి సంబంధించినది. మరోటి నాకు ఉపయోగపడే వస్తువుల కోసం. నాది డ్రై స్కిన్‌. అందుకే బాడీ లోషన్‌ వెంటబెట్టుకుంటా. సెల్‌ఫోన్‌, ఛార్జర్‌, పవర్‌ బ్యాంక్‌ లేని బ్యాగులు కనిపించడం కష్టం. నాకూ అవే ముఖ్యం. ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి పాన్‌కార్డు, ఆధార్‌కార్డు.. ఉండాల్సిందేగా? ఇంకా లిప్‌స్టిక్‌, హెయిర్‌ బ్రష్‌, మౌత్‌ ఫ్రెష్‌నెర్‌ ఇలా చిన్న చిన్నవి చాలా ఉంటాయి. వీలైతే ఒక్క పుస్తకమైనా పెట్టుకుని వెళ్తా. కాస్త ఖాళీ దొరికేస్తే.. కొన్ని పేజీలు తిరగేస్తా".

- పూజా హెగ్డే

Heroins-with-Handbags
పూజాహెగ్డే

ఇదీ చూడండి.. 'ఒంటి కాలిపై నిలుచొని షాలినికి ప్రపోజ్​ చేశాడట'

Last Updated : Mar 1, 2020, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.