రాశీఖన్నా(rashi khanna bollywood movies) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూనే బాలీవుడ్‌లోనూ మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది(rashi khanna upcoming movie). తాజాగా ఓ హిందీ మూవీలో ఆమె ఎంపికైనట్లు సమాచారం.
ఇటీవలే 'షేర్షా'(siddharth malhotra shershah) చిత్రంతో విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా.. ప్రస్తుతం 'యోధా'లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(గురువారం) ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది(siddharth malhotra yodha movie). ఈ చిత్రంలోనే ఇద్దరు కథానాయికలు నటించనున్నారని వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది చిత్రబృందం. ఆ ఇద్దరు హీరోయిన్లలలో ఒకరు దిశపటాని కాగా మరొకరు రాశీ అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం హిందీలో అజయ్‌దేవగణ్‌తో 'రుద్రా', రాజ్‌డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది రాశీ(rashi khanna latest movies). దీంతో పాటే తెలుగులో 'థ్యాంక్యూ', 'పక్కాకమర్షియల్' తమిళంలో 'సైతాన్ కా బచ్చా', 'సర్దార్', 'మేథావి' సినిమాలను చేస్తోంది.
ఇదీ చూడండి: గోల్డెన్ డ్రెస్‌లో రాశీఖన్నా.. చార్లీ చాప్లిన్‌గా నభా