ETV Bharat / sitara

నటి నిక్కీ గల్రానీకి కరోనా.. లక్షణాలు ఇవే - నిక్కీ గల్రానీ ఆది పినిశెట్టి

తనకు వారం క్రితం కరోనా సోకిందన్న నటి నిక్కీ గల్రానీ.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పింది. మనకోసమే కాకుండా మిగతా వ్యక్తులు గురించి ఆలోచించి, తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని కోరింది.

నటి నిక్కీ గల్రానీకి కరోనా.. లక్షణాలు ఇవే
నటి నిక్కీ గల్రానీ
author img

By

Published : Aug 14, 2020, 8:00 AM IST

తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ నిక్కీ గల్రానీకి కరోనా సోకింది. వారం క్రితమే వైరస్ బారిన పడినా, ఈ విషయాన్ని ఆమె గురువారం స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం మెర్గుగానే ఉందని, ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించింది.

heroine Nikki Galrani tests positive for COVID-19
నటి నిక్కీ గల్రానీ సోషల్ మీడియా పోస్ట్

"కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండి. నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నా. బయటపడతాననే నమ్మకం ఉంది. కానీ వయసు ఎక్కువున్న నా తల్లిదండ్రులకు వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కాబట్టి వీలైనంతవరకు మాస్క్​లు తప్పనిసరిగా ధరించండి. భౌతిక దూరం పాటించండి. మన ఆరోగ్యం కోసమే సమాజంలో ఉన్న మిగతవారి గురించి ఆలోచించండి. నా ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్న వారికి ధన్యవాదాలు"

-నిక్కీ గల్రానీ, కథానాయిక

ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పలు సినిమా షూటింగ్​లు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్​బీ అమితాబ్, దర్శకుడు రాజమౌళి, హీరో విశాల్ తదితరులు కరోనాను జయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.