టాలీవుడ్‌లో పదేళ్లుగా హీరోయిన్‌గా రాణిస్తోన్న నటి కాజల్ అగర్వాల్. అగ్రహీరోలతో పాటు యువ కథానాయకులతోనూ నటించి మంచి గుర్తింపు సాధించింది. త్వరలో 'రణరంగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ చెయ్యాల్సిన పనులు అస్సలు మర్చిపోనని అంటోంది.
"సినీ రంగంలో విరామం లేకుండా పనిచేస్తున్నా. చిత్రీకరణ, ప్రచారాలతోనే కాలం గడిచిపోతుంది. కానీ, ఎంత అలసిపోయి రాత్రి ఇంటికి చేరినా కాసేపు న్యూస్ ఛానెల్స్ చూస్తా. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా". -కాజల్, హీరోయిన్
సినిమా లేకుండా నన్ను నేను ఊహించుకోలేనేమో.. కానీ, సినిమానే జీవితం కాదని తెలుసంటోంది కాజల్. అందుకే సమాజంలోని సగటు వ్యక్తిగా అన్నీ తెలుసుకుంటూ... ఏం చేయాలో అది చేస్తుంటానని తెలిపింది.
ఇది సంగతి: 'సాహో' మ్యూజిక్ కంపోజర్పై దాడి