ETV Bharat / sitara

ఒంటరిగానే వస్తున్న టాలీవుడ్ 'కథానాయిక' - ఒంటరిగానే వస్తున్న టాలీవుడ్ 'కథానాయిక'

తెలుగు సినీ చిత్రసీమలో కథానాయిక ప్రాధాన్యమున్న కథలు పెరుగుతున్నాయి. దర్శకులు ఈ తరహా కథల్ని ఇటీవలే కాలంలో ఎక్కువగా సిద్ధం చేస్తున్నారు. అందులో నటించేందుకు పలువురు భామలు ఆసక్తి చూపుతున్నారు.

ఒంటరిగానే వస్తున్న టాలీవుడ్ 'కథానాయిక'
టాలీవుడ్ హీరోయిన్లు
author img

By

Published : Jun 26, 2020, 6:19 AM IST

కొన్ని సినిమాల్లో కథానాయికలు హీరోలతో కలిసి ఆడిపాడటానికే పరిమితం అవుతుంటారు. కొన్నిసార్లు మాత్రం కథల్లో వాళ్లకూ భాగం ఉంటుంది. ఈ రెండూ కాకుండా... వాళ్ల చుట్టూనే తిరిగే కథలూ కొన్ని ఉంటాయి. అవి వాళ్ల కోసమే పుట్టే కథలు. అలా కొన్నాళ్లుగా తెలుగు చిత్రసీమలో కథానాయికల కోసం కథలు విరివిగా సిద్ధమవుతున్నాయి. హీరోల ఆధిపత్యం కొనసాగుతున్నా... అందుకు దీటుగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల సంఖ్య పెరుగుతోంది. దర్శకులు మహిళల కథలూ చెప్పే ప్రయత్నం చేస్తుండడమే అందుకు కారణం.

తెలుగు సినిమాల్లో హీరోయిజమే కాదు... అప్పుడప్పుడు హీరోయినిజమూ కనిపిస్తుంటుంది. స్టార్‌ భామలు నాయికా ప్రాధాన్యమున్న కథల్ని ఎంచుకుని సందడి చేస్తుంటారు. హీరోల తరహాలో తామూ ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించగలమని నిరూపిస్తున్నారు. అది దర్శకనిర్మాతలకీ ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఇదివరకు సినిమా అంటే హీరోల్ని లక్ష్యంగా చేసుకోవాల్సిందే. వాళ్ల కాల్షీట్లు ఎప్పుడు దొరికితే అప్పుడే సినిమా పట్టాలెక్కేది. ఇప్పుడు దర్శకనిర్మాతలు హీరోయిన్ల కథలపైనా దృష్టి పెడుతున్నారు. కథల్ని నమ్ముకుని అందుకు తగ్గట్టుగా ఖర్చు పెడుతూ సినిమాల్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు సినిమా నచ్చిందంటే అవి అగ్ర హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు సాధిస్తున్నాయి. 'మహానటి', 'ఓ బేబి' లాంటి చిత్రాలే అందుకు తార్కాణం.

వాళ్లున్నారు కదా...

ఇదివరకు కథానాయిక ప్రాధాన్యమున్న కథల్ని సిద్ధం చేయాలన్నా... నటించడానికి ఎవరున్నారు? కథను మోయగలరా? అనే ప్రశ్నలు తలెత్తేవి. దాంతో దర్శకులు సైతం ఆ ప్రయత్నాలను విరమించుకుని హీరోలపైనే దృష్టిపెట్టేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథల్ని మోయగల సమర్థులు చాలామందే కనిపిస్తున్నారు. 'అరుంధతి', 'రుద్రమదేవి' మొదలుకొని అనుష్క ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించగల శక్తిసామర్థ్యాలున్న కథానాయికగా ఆమెకు పేరొచ్చింది. దాంతో అనుష్క కోసం తరచూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే 'నిశ్శబ్దం' సినిమాతో సందడి చేయనున్న ఆమె కోసం, యువీ క్రియేషన్స్‌లో మరో స్క్రిప్టు సిద్ధమవుతోంది.

పదేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సమంత ఇటీవల కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. 'ఓ బేబి'తో ఆమె చేసిన మాయ అంతా ఇంతా కాదు. ఆమెను దృష్టిలో ఉంచుకునే సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలోనూ రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తోంది సమంత.

కుర్రభామలూ సై

'మహానటి' తర్వాత కీర్తి సురేష్‌ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలే ఎక్కువగా చేస్తోంది. మొన్న విడుదలైన 'పెంగ్విన్‌' మొదలుకొని 'గుడ్‌లక్‌ సఖి', 'మిస్‌ ఇండియా' చిత్రాలు చేసిందామె. త్వరలోనే ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

"నా కోసం నేను సిద్ధం చేయించుకున్న కథలేవీ లేవు. మహిళల కథలు చెప్పాలనే తపన దర్శకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది" అని అంటున్నారు కీర్తి.

తమన్నా, కాజల్‌, తాప్సీ, శ్రియ తదితర భామలంతా ఇప్పుడు అలాంటి కథలవైపే చూస్తున్నారు. త్వరలోనే 'దటీజ్‌ మహాలక్ష్మి'తో సందడి చేయబోతోంది తమన్నా. కాజల్‌ తమిళంలో ఓ సినిమా చేస్తోంది. నిత్యమేనన్‌, రెజీనా, నివేదా థామస్‌, అనుపమ పరమేశ్వరన్‌లు ఇప్పుడు తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తున్నారు. 'బ్రోచేవారెవరురా'తో అలరించిన నివేదా థామస్‌, 'అ!'తో ఆకట్టుకున్న రెజీనా కలిసి 'మిడ్‌నైట్‌ రన్నర్స్‌' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. అనుపమ ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటిస్తోంది. అది ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇలా ఈ కథలతో కుర్రభామలూ తమ నటనా దాహాన్ని తీర్చుకుంటున్నారు. నిత్యమేనన్‌, శ్రియల కోసం కూడా స్క్రిప్టులు సిద్ధమయ్యాయి.

వీళ్లు రాసి పెట్టారు

కథానాయికల్ని దృష్టిలో ఉంచుకుని కథల్ని సిద్ధం చేసిన యువ దర్శకులు చాలా మందే కనిపిస్తున్నారు. 'ఎఫ్‌2' కంటే ముందు అనిల్‌ రావిపూడి ఓ కథానాయిక ప్రాధాన్యమున్న సినిమానే చేయాలనుకున్నారట. అందుకోసం కథ సిద్ధం చేశారు. ఇప్పట్లో కాకపోయినా, దాన్ని ఎప్పటికైనా తెరకెక్కిస్తా అంటున్నారాయన. అలాగే ప్రస్తుతం మహేష్‌బాబుతో 'సర్కారు వారి పాట' చేస్తున్న పరశురామ్‌ దగ్గర కథానాయికల కోసం ఓ కథ ఉంది. పరిశ్రమ ఊపందుకున్న తర్వాత మరిన్ని కథలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

"అబ్బాయిల కథల్లో అమ్మాయిలు ఎలా కనిపిస్తుంటారో, అలా వాళ్ల కథల్లోనూ హీరోలు కనిపించొచ్చు. మేం చేసిన 'బ్రోచేవారెవరురా' అలాంటి సినిమానే. కానీ ఆ సినిమాతో అందరికీ పేరొచ్చింది కదా. అబ్బాయిలు, అమ్మాయిల కథలనే కాదు... వయసు మీద పడిన వ్యక్తుల కథలూ తెరకెక్కాలి. హీరోయిజం అలాంటి కథల్లో కూడా చూపించొచ్చు" అని అంటున్నారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.