షూటింగ్‌లో గాయపడ్డ యువ కథానాయకుడు శర్వానంద్‌కు శస్త్ర చికిత్స పూర్తయింది. వైద్యులు ఆయన భుజానికి 11 గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ మరో రెండు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నారు. ఫలితంగా ప్రస్తుతం శర్వా నటిస్తోన్న రణ రంగం, 96 సినిమా చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడనున్నాయి.
‘96’ సినిమా షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమైంది. ఈ సినిమాలో స్కై డైవింగ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలున్నాయి. దాని కోసం థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ శర్వా గాయడ్డారు. సరైన దిశలో ల్యాండ్ అవ్వని కారణంగా శర్వా భుజానికి, కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నేడు శస్త్రచికిత్స చేశారు.