సినీనటులు, క్రికెటర్లు తమ గ్యారేజీలో ఎన్ని కార్లున్నా.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త వాటిని చూసి మనసు పడతారు. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు రణ్‌వీర్ సింగ్ కూడా భారీ ధర చెల్లించి ఓ కారు కొన్నాడు. లాంబోర్గిని యూరస్ మోడల్ (రెడ్)కు చెందిన ఈ వాహనం ధర రూ.3 కోట్లు. స్వయంగా ఆయనే కారును డ్రైవ్ చేస్తూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల 'గల్లీబాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడీ స్టార్హీరో. ఈ చిత్రం విదేశీ భాషా చిత్ర విభాగంలో భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు రణ్‌వీర్.
ఇదీ చదవండి..