ETV Bharat / sitara

'మీ ప్రేమకు థాంక్స్​.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా'​ - మీ ప్రేమకు థాంక్స్​.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా: నిఖిల్​

ఇటీవల 'కార్తికేయ-2' చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డ హీరో నిఖిల్.. ట్విట్టర్​లో స్పందించాడు. తనకోసం చాలా మంది ప్రార్థించారని.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపాడు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు నిఖిల్​. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తానంటూ ట్వీట్​ చేశాడు.

Hero Nikhil took to the Twitter platform to respond to his injury
'మీ ప్రేమకు థాంక్స్​.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా'​
author img

By

Published : Mar 12, 2021, 6:54 AM IST

తాను వేగంగా కోలుకుంటున్నానని యువ కథానాయకుడు నిఖిల్‌ అన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ 'కార్తికేయ2' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కాగా, చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించే క్రమంలో నిఖిల్‌ కాలికి గాయమైంది. దీంతో నిఖిల్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంపై నిఖిల్‌ ట్విట్టర్​‌ వేదికగా స్పందించాడు. తన కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తనకు చాలామంది ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలసుకుంటున్నారని, మరికొంత మంది మెసెజ్‌లు పంపుతున్నారని అన్నాడు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా.. అంటూ ఆయన ఫొటో పంచుకున్నాడు.

  • Suffered a Left Calf Muscle Tear during the filming of an Action Sequence in Gujarat for #Karthikeya2
    Receiving lots of Concerned calls and messages... Hugeee thanks to u all for the Love ❤️ and Energy being sent to me... Will Bounce back with Double the Enthusiasm 💪🏼😇 pic.twitter.com/Tl5clbhokA

    — Nikhil Siddhartha (@actor_Nikhil) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. దానికి సీక్వెల్‌గా 'కార్తికేయ2'ను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్‌ నిర్మాతలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇదీ చదవండి: 'వరల్డ్ ఫేమస్​ లవర్​'తో సెంచరీ కొట్టిన విజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.