హీరో నిఖిల్-దర్శకుడు చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమా షూటింగ్లో హీరో నిఖిల్ గాయపడ్డారని సమాచారం. సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగిందట. అయితే ఈ ప్రమాదంలో నిఖిల్ స్వల్పగాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది.
నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతోంది 'కార్తికేయ 2'. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా చిత్రబృందం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చూడండి: 'కార్తికేయ 2'లో బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?