Nani shyam singha roy: ఓ భాషలో హిట్ అయినా సినిమాను మరోభాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేశ్ లాంటి అగ్రహీరోలు రీమేక్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు యువహీరోలు కూడా వాటిని చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం ఇకపై రీమేక్‌లు అస్సలు చేయనని అంటున్నారు.
'శ్యామ్ సింగరాయ్' ప్రచారంలో భాగంగా బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నాని స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన రెండు రీమేక్‌ల నేర్పిన పాఠం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
రీమేక్‌లు తనకు సెట్ కావానే విషయం తనకు అర్థమైందని చెప్పిన నాని.. తన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుండటం ఆనందం కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కల్యాణం సినిమాలు రీమేక్‌లే. అలానే నాని 'జెర్సీ'.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుంది. డిసెంబరు 31న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
వినూత్న కథతో తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్'లో నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. డిసెంబరు 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇవీ చదవండి:
- కృతిశెట్టితో రొమాన్స్ గురించి హీరో నాని మాటల్లో..
- 'శ్యామ్ సింగరాయ్' కోసం 15 గెటప్‌లు ట్రై చేశా: నాని
- రెండేళ్లు మిస్ అయ్యారు.. ఈసారి క్రిస్మస్ మనదే: నాని
- రెండు సినిమాలు ఫ్లాప్.. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా: నాని
- 'శ్యామ్ సింగరాయ్' అందుకే మరింత స్పెషల్: నాని
- 'నానిపై నమ్మకంతోనే ఎక్కడా రాజీపడలేదు'
- Sirivennela: 'సిరివెన్నెల' చివరిగీతం విడుదల.. 'శ్యామ్ సింగరాయ్'లో..