గంగోత్రితో పరిచయమయ్యాడు.. ఫీల్ మై లవ్ అంటూ పలకరించాడు.. బన్నీ బన్నీ అంటూ భేష్ అనిపించాడు.. దేశముదురుతో దుమ్మురేపాడు.. పరుగుతో పరుగులెత్తించాడు... ఆర్య 2తో ప్రేమను పంచాడు.. వరుడుతో ఓ మంచి భర్త అనిపించుకున్నాడు.. జులాయితో జూలు విదిల్చాడు.. రేసుగుర్రంతో తన దూకుడు చూపించాడు.. సన్ ఆఫ్ సత్యమూర్తితో నాన్నపై తనకున్న ప్రేమను చూపించాడు.. సరైనోడు తనలోని దమ్ము చూపాడు.. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దేశంపై తనకున్న ప్రేమను చెప్పాడు.. మలయాళ ప్రేక్షకులకు మల్లూ అర్జున్‌గా మారాడు.. అల్లు అర్జున్. ఇలా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. త్వరలోనే పుష్ప సినిమాతో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నాడు. గురువారం(నేడు) అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం..
అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించాడు. పద్దెనిమిదేళ్ల వరకు చెన్నైలోనే పెరిగిన అల్లు అర్జున్ పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పడింది. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే పియానో, జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాతైనా... మేనమామ చిరంజీవి అగ్రనటుడైనప్పటికీ.. సినీఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చిరంజీవి నటించిన 'విజేత' సినిమాలో చిన్నవయసులోనే తొలిసారి నటించాడు అల్లు అర్జున్. 'స్వాతి ముత్యం' లోనూ కమల్‌హాసన్ మనుమడిగా కనిపించాడు. అనంతరం 'డాడీ' చిత్రంలో అతిథి పాత్రలో అలరించాడు. గంగోత్రితో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన ఆర్యతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, రుద్రమదేవి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అల వైకుంఠపురములో లాంటి విజయాలను అందుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటనతోనే కాకుండా తన డ్యాన్స్‌తో అభిమానుల్ని సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్. స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న అతడు యువతరానికి ఓ ఐకాన్‌గా కొనసాగుతున్నాడు. స్టైల్‌తో తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ స్టార్డమ్ తెచ్చుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం తన 20వ చిత్రం పుష్పను సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆగస్టు 13న విడుదల కానుందీ సినిమా.
అల్లు అర్జున్ హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అబ్బాయి అయాన్‌తో పాటు, అమ్మాయి అర్హ ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">