ETV Bharat / sitara

సల్మాన్ ఖాన్​​ షోలో సందడి చేయనున్న బన్నీ! - alluarjun in salman khan show

allu arjun in bigg boss: 'పుష్ప' ప్రమోషన్స్​లో భాగంగా హీరో అల్లుఅర్జున్​.. హిందీ బిగ్​బాస్​కు అతిథిగా వెళ్లనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

హిందీ బిగ్​బాస్​లో సల్మాన్​ ఖాన్​,  Alluarjun in hindi bigboss
హిందీ బిగ్​బాస్​లో సల్మాన్​ ఖాన్​
author img

By

Published : Nov 28, 2021, 8:06 PM IST

allu arjun in bigg boss: ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​ నటించిన 'పుష్ప' సినిమా త్వరలోనే రిలీజ్​ కానుంది(Alluarjun pushpa movie). ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​ను మొదలుపెట్టింది చిత్రబృందం. వరుసగా అప్డేట్​లను ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది. అయితే హిందీలో ఈ మూవీని ప్రమోట్​ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నారని తెలిసింది.

ప్రమోషన్స్​లో భాగంగా సల్మాన్​ఖాన్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్​బాస్​ 15వ సీజన్​కు బన్నీ అతిథిగా వెళ్లనున్నారని టాక్​ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, అల్లుఅర్జున్​, సల్మాన్​ ఖాన్​ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవలే సల్మాన్​ ఖాన్​ తన 'రాధే' సినిమాలో(salman khan dj song remix).. బన్నీ స్టెప్పులేసిన 'డీజే'లోని సీటీమార్​ సాంగ్​ను రిక్రియేట్​ చేశారు. మరోవైపు, బన్నీ.. షాహిద్​కపూర్​తో కలిసి ఓ మల్టీస్టారర్​ సినిమా చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ​​

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

ఇదీ చూడండి: బాలయ్యలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు: అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.