nagachaitanya happy birthday: ఈ హీరో స్క్రీన్‌పై ఫుల్ 'జోష్'తో కనిపిస్తారు. ఎందుకంటే.. ఆ హీరోకి నటనపై '100 పర్సెంట్ లవ్' ఉంది కాబట్టి. ఒకప్పుడు ఈ కథానాయకుడు పేరు చెప్పగానే అమ్మాయిల గుండెల్లో తమ హీరో ఎవరి సొంతం అయిపోతాడేమోనన్న 'దడ' పుట్టేది. అయితే ఆ తర్వాత తనను మాయ చేసిన 'ఓ బేబీ'ని పెళ్లి చేసుకొని ఆ 'దడ'కు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. తెరపై తన నటన 'తడాఖా'ను చూపిస్తారు ఈ స్టార్. అందుకే ఈయన సినిమా విడుదల అయితే ప్రేక్షకులు పండుగలా భావిస్తారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' అని ఈ హీరో సినిమాకు వెళ్తారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆయన ఎవరై ఉంటారో? అక్కినేని నాగచైతన్య. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కుటుంబ నేపథ్యం
ప్రముఖ నటుడు నాగార్జున, ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటి దంపతులకు నాగచైతన్య జన్మించారు. చైతన్య బాల్యం చెన్నైలో గడిచింది. 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి లక్ష్మీ దగ్గుబాటి దగ్గర పెరిగారు. పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తరువాత పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు నాగచైతన్య. కళాశాలలో ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆశని తండ్రి నాగార్జునకు చెప్పారు. ముంబయిలో మూడు నెలల నటన కోర్సులో చేరారు. లాస్ ఏంజిల్స్‌లో నటన, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఇంకా... నటనకు ముందు ఒక సంవత్సరం పాటు వాయిస్, డైలాగ్ కోచింగ్ తీసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వివాహం
2017, జనవరి 29న నటి సమంతా రూత్ ప్రభుతో నాగచైతన్యకు నిశ్చితార్ధం జరిగింది. చైతన్య, సమంత అక్టోబర్ 6న హిందూ సంప్రదాయ ప్రకారం, అక్టోబర్ 7న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహమాడారు. ఈ రెండూ ప్రైవేట్ వేడుకలే. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకులకు హాజరయ్యారు. అభిమానులు ఈ దంపతులను 'చే సామ్' అని పిలుస్తారు. అయితే వీరిద్దరూ.. తమ నాలుగేళ్ల బంధానికి గుడ్‌బై చెబుతూ విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవలే ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కెరీర్
వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'జోష్' సినిమాతో చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఇందులో ఓ కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు. మొదటి సినిమా అయినా మంచి ప్రదర్శన ఇచ్చారని నాగచైతన్యపై రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'ఏ మాయ చేసావే' సినిమాలో నటించి యువతుల మనసు దోచుకున్నారు. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో '100 పర్సెంట్ లవ్' సినిమాతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. అలా ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'లవ్ స్టోరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా పలు అవార్డులను సైతం అందుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: chaysam divorce: రియల్‌లైఫ్‌లో 'హిట్' కొట్టని స్టార్ కపుల్స్