భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్స్ బయోపిక్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హరియాణాకు చెందిన హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ హవా సింగ్ జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తెరపై అతడి పాత్రను సూరజ్ పంచోలి పోషించనున్నాడు. ప్రకాష్ నంబియార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ కథానాయకుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశాడు.
-
Hawa se baatein karega singh... #HawaSinghBiopic @Sooraj9pancholi pic.twitter.com/2zS0AQYs0n
— Salman Khan (@BeingSalmanKhan) February 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hawa se baatein karega singh... #HawaSinghBiopic @Sooraj9pancholi pic.twitter.com/2zS0AQYs0n
— Salman Khan (@BeingSalmanKhan) February 4, 2020Hawa se baatein karega singh... #HawaSinghBiopic @Sooraj9pancholi pic.twitter.com/2zS0AQYs0n
— Salman Khan (@BeingSalmanKhan) February 4, 2020
ఆసియా క్రీడల్లో వరుసగా రెండుసార్లు బంగారు పతకం సాధించి సత్తా చాటాడు హవా సింగ్. 1961 నుంచి 1972 వరకు వరుసగా 11 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అర్జున, ద్రోణాచార్య లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నాడు.
ఇదీ చూడండి.. మరోసారి తెరపై నేచురల్ స్టార్స్ జోడి!