ETV Bharat / sitara

డిఫరెంట్​ స్టోరీస్​తో వచ్చారు.. హ్యాట్రిక్​ హిట్​ కొట్టారు!

author img

By

Published : Dec 28, 2021, 9:16 AM IST

Hat trick Hit Movies 2021: చిత్రసీమలో హీరోహీరోయిన్ల కాంబోలకే కాదు డైరెక్టర్​-హీరో కాంబినేషన్స్​కు కూడా ఫ్యాన్స్​ ఉంటారు. ఎందుకంటే వారి కలయికలో వచ్చిన చిత్రాలు గొప్పగా ఆకట్టుకుంటాయని వారి నమ్మకం. ఆ స్టార్ కాంబో కలిసి మరో సినిమా చేస్తున్నారంటేనే అంచానాలు కూడా తారస్థాయిలో ఉంటాయి. కాగా, ఈ ఏడాది పూర్తయిపోతున్న నేపథ్యంలో 2021లో సినీప్రియుల ముందుకు వచ్చి హ్యాట్రిక్​ హిట్​ అందుకున్న సూపర్​ కాంబోలు ఏవో చూసేద్దాం.

hatrick hit movies 2021, హ్యాట్రిక్​ హిట్​ సినిమాలు 2021
హ్యాట్రిక్​ హిట్​ సినిమాలు 2021

Hat trick Hit Movies 2021: టాలీవుడ్​ లేదా ఇతర భాషల్లో కొన్ని కాంబినేషన్స్​కు స్పెషల్ క్రేజ్​ ఉంటుంది. వారి చిత్రాలు ఎవర్​గ్రీన్​గా నిలవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా కొందరు డైరెక్టర్​-హీరోల కాంబోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు చేసిన సినిమాలు వరుసగా సూపర్​హిట్​లను అందుకుంటాయి. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​ను నింపుతాయి. వారి కలయికలో చిత్రాలు మళ్లీ ఎప్పుడు వస్తాయా? అంటూ అభిమానులను ఆసక్తిగా ఎదురుచేసేలా చేస్తాయి.

అయితే ఇప్పటికే రెండు సార్లు జోడీ కట్టి సక్సెస్​ అయిన హీరో, దర్శకులు తాజాగా మరోసారి విభిన్నమైన కథాంశంతో వచ్చి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇందులో కథానాయకుల గెటప్​లు కూడా సినీప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలా ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి సూపర్​హిట్​ను అందుకున్న డైరెక్టర్​-హీరో​ కాంబోలు ఏంటో చూసేద్దాం..

బోయపాటి-బాలయ్య గర్జన

Boyapati-Balakrishna Hat trick movie: 'అఖండ'.. బోయపాటి-బాలకృష్ణ కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. కరోనా సెకండ్​ వేవ్​ తర్వాత రిలీజ్​ అయిన తొలి పెద్ద సినిమాగా నిలిచి సూపర్​హిట్​ను అందుకుంది. మంచి వసూళ్లను దక్కించుకుని బాలయ్య కెరీర్​లోనే ప్రత్యేకంగా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇందులో బాలయ్య అఘోర గెటప్​, నటన, డైలాగ్​లు, తమన్​ బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ మూవీకి హైలైట్​గా నిలిచాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్​, పూర్ణ, శ్రీకాంత్​ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్'​ కూడా ఘన విజయాన్ని అందుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తగ్గేదే లే

Alluarjun-Sukumar Hat trick movie:'పుష్ప' పార్ట్​-1.. 'తగ్గేదే లే' అంటూ 'అఖండ' తర్వాత థియేటర్లో సందడి చేసిన అల్లు అర్జున్ 'పుష్ప'.. చెప్పినట్లుగా ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్​ ముందు అదరగొట్టింది. ఇది కూడా భారీ వసూళ్లను అందుకుంది. దర్శకుడు సుకుమార్​ టేకింగ్​, హీరో బన్నీ డీగ్లామర్​ గెటప్​, యాక్టింగ్​, డైలాగ్​లు, డీఎస్పీ మ్యూజిక్​​ ఫ్యాన్స్​ను విపరీతంగా అలరించాయి. ఇక రష్మిక, సునీల్, అనసూయ కూడా తమకున్న పరిధిలో బాగానే నటించారు. సుకుమార్​-బన్నీ కలిసి గతంలో 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రామ్​-కిషోర్​

Kisore-Ram Hat trick movie: 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి ఫీల్​ గుడ్​ మూవీస్​తో ప్రేక్షకుల్లో సక్సెస్​ఫుల్​ కాంబినేషన్​గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు కిషోర్​-హీరో రామ్​. వీరి కలయికలో వచ్చిన 'రెడ్' సినిమా కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో వీరిది హ్యాట్రిక్​ హిట్​ కాంబోగా నిలిచింది. ఇందులో రామ్​ రెండు డిఫెరెంట్​ లుక్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఫామ్​లోకి

Raviteja-Gopichand Malineni Hat trick movie: ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్'​ సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ను అందుకుని మళ్లీ ఫామ్​లోకి వచ్చారు మాస్​ మహారాజా రవితేజ. ఇందులో రవితేజ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించారు. గోపీచంద్​ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కలయికలో ఇది మూడో చిత్రం. 2010లో రవితేజ నటించిన 'డాన్‌ శీను' చిత్రంతో దర్శకుడిగా మారిన గోపీచంద్‌.. ఆ తర్వాత మాస్​మాహారాజాతో 'బలుపు'ను తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు చిత్రాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.