రీఎంట్రీలో పవన్‌కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరించాడు. 'పింక్' తెలుగు రీమేక్‌తో పాటు, క్రిష్‌తో ఓ పీరియాడికల్ చిత్రం చేస్తున్నాడీ కథానాయకుడు. వీటి తర్వాత హరీశ్ శంకర్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో హరీశ్.. కథానాయిక పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాడు. ఇందుకు గతంలో తనతో పనిచేసిన పూజా హెగ్డే అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట ఈ దర్శకుడు. ఇదే జరిగితే పవన్‌తో తొలిసారి.. హరీశ్ శంకర్‌తో పూజా హెగ్డే మూడోసారి పనిచేసినట్లు అవుతుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గురించి, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఇదీ చదవండి: సినీ ప్రముఖుల వద్ద రూ.300 కోట్ల అక్రమ నగదు