ETV Bharat / sitara

'విలనిజం అంటే నాకిష్టం.. అలాంటి పాత్రను వదులుకోను' - latest telugu entertainment news

'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్' విడుదల నేపథ్యంలో విలేకర్లతో సినిమా విశేషాలను పంచుకుంది హీరోయిన్ హన్సిక. మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ప్రతినాయక ఛాయలున్న​ పాత్రలొస్తే అస్సలు వదులుకోనని చెప్పింది.

హీరోయిన్ హన్సిక
author img

By

Published : Nov 13, 2019, 3:22 PM IST

"ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌డ‌మే నా ప‌ని. ఆ అవ‌కాశం ఏ భాష నుంచి వ‌చ్చినా స్వీక‌రిస్తా. కానీ తెలుగు, త‌మిళ భాష‌లు నాకు రెండు క‌ళ్లులాంటివి. ఈ రెండు చోట్ల న‌టించ‌డాన్ని ఎంత‌గానో ఆస్వాదిస్తాను" అని అంటోంది హీరోయిన్ హ‌న్సిక‌.

'దేశ‌ముదురు'తో ప్ర‌యాణం ప్రారంభించిన ఈ భామ... ఆ త‌ర్వాత త‌మిళంలో బిజీ అయిపోయింది. కానీ టాలీవుడ్​ను మాత్రం మ‌రిచిపోలేదు. ఇక్కడ అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ న‌టిస్తోంది. 'గౌత‌మ్ నందా' త‌ర్వాత హ‌న్సిక న‌టించిన తెలుగు చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బిఎ.బిఎల్‌'. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంద‌ర్భంగా హ‌న్సిక.. బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించింది.

  • న్యాయ‌వాది పాత్ర‌లో న‌టించారు క‌దా, మీకు లాయ‌ర్ స్నేహితులు ఎవ‌రైనా ఉన్నారా?

ఒక‌రున్నారు. త‌ను మా సోద‌రుడికి స్నేహితుడు. అందువల్ల నాకూ సోద‌రుడే అన్న‌మాట‌. ఎప్పుడు ఫోన్ చేసినా కోర్టులో ఉన్నానంటుంటాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు త‌న ప్ర‌పంచం ఎలా ఉంటుందో ఊహించుకున్నా. నేనూ చిన్న‌ప్పుడు న్యాయ‌వాదిని అవ్వాల‌నే అనుకొనేదాన్ని. ఏ విష‌యంలోనైనా స‌రే నేను బాగా వాదిస్తుంటాన‌న్న‌మాట(న‌వ్వుతూ).

  • ఈ సినిమాతో ఆ కోరిక కొంత‌వ‌ర‌కు నెర‌వేరింద‌న్న‌మాట‌?

నేనేమీ సీరియ‌స్ లాయ‌ర్‌ను కాదులెండి. న‌వ్వించే చోటా మోటా లాయ‌ర్‌ను. తెనాలి పాత్ర‌లో క‌నిపించే సందీప్‌కిష‌న్‌తో క‌లిసి చేసే సంద‌డి మంచి వినోదాన్ని పంచుతుంది.

Hansika Motwani
హీరోయిన్ హన్సిక
  • ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ప్ర‌ధాన‌మైన ఓ కార‌ణం?

క‌థే. హాస్య‌భ‌రితంగా సాగే క‌థ‌లంటే స్వ‌త‌హాగా నాకు ఇష్టం. ఈ హత్య ఎవ‌రు చేశారు? కార‌ణం ఏంటి? క‌థ త‌ర్వాత ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో?.. ఇలా ఒక ప‌క్క సినిమా చూస్తూ మ‌రో ప‌క్క బుర్ర‌కు ప‌నిపెట్టే చిత్రం కాదిది. హాయిగా స‌ర‌దాగా చూస్తున్నంత‌సేపూ న‌వ్విస్తుంది. దర్శకుడు నాగేశ్వ‌ర‌ర్‌రెడ్డి క‌థ చెప్ప‌డ‌మే గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. ఆయ‌న మార్క్ సినిమా ఇది.

  • తెలుగులో సినిమా సినిమాకు రెండేళ్లు విరామం వ‌స్తోంది. కార‌ణ‌మేంటి?

ఈ విషయం నేను గ‌మ‌నించ‌లేదు. మంచి అవ‌కాశం నాకు ముఖ్యం. మంచి క‌థ నా దగ్గరకు వస్తే అది ఏ భాష‌ అనేది ప‌ట్టించుకోను. కొన్ని సంద‌ర్భాల్లో తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చినా త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వల్ల చేయ‌లేక‌పోయాను. అంతే.. ప్ర‌త్యేకంగా విరామం తీసుకోలేదు.

Hansika Motwani
హీరోయిన్ హన్సిక
  • క‌థానాయిక‌గా మీది సుదీర్ఘ‌ ప్ర‌యాణం.. యాభై సినిమాలు చేశారు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఏమ‌నిపిస్తోంది?

ఇన్ని సినిమాలు చేయాల‌ని, చేస్తాన‌ని కాని ఊహించలేదు. ఒక ప్ర‌వాహంలా ప్ర‌యాణం సాగిపోతోందంతే. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

  • వ్య‌తిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్ర‌లొస్తే చేయ‌డానికి సిద్ధ‌మేనా?

అస్స‌లు ఆలోచించ‌ను. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఓ సినిమా చేశా. అందులో నాది వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్రే. విల‌నిజంతో కూడిన పాత్ర‌లంటే నాకు చాలా ఇష్టం. అవ‌కాశం వ‌చ్చిందంటే త‌ప్ప‌కుండా చేస్తా.

  • బ‌రువు బాగా త‌గ్గిన‌ట్టున్నారు. మ‌రింత నాజూగ్గా క‌నిపిస్తున్నారు?

ఐదేళ్లుగా ఫిట్‌నెస్ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటున్నా. నాజూగ్గా మార‌డం వెన‌క ర‌హస్యం స్క్వాష్ ఆడ‌ట‌మే. స‌మ‌యం దొరికితే ఈ గేమ్ ఆడుతుంటా. అది నా బ‌రువును బాగా నియంత్రిస్తుంటుంది.

Hansika Motwani
హీరోయిన్ హన్సిక
  • తెలుగులో కొత్త‌గా ఒప్పుకున్న సినిమాలేమైనా ఉన్నాయా?

'భాగమతి' ఫేమ్ జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో వెబ్‌సిరీస్ చేశా. అందులో నేటితరం యువ‌తుల్ని ప్ర‌తిబింబించే పాత్ర నాది. మరో నాలుగైదు రోజులు మాత్రమే చిత్రీక‌ర‌ణ జరగాలి. రాబోయే కాలమంతా వెబ్ సిరీస్‌లదే. నేనైతే బాగా చూస్తుంటా. త‌ప్ప‌కుండా ఈ వెబ్​సిరీస్ అలరిస్తుంది.

  • ఈమ‌ధ్య కొత్త కారు కొన్న‌ట్టున్నారు?

దంతేరస్​ను పుర‌స్క‌రించుకొని మా అమ్మ.. మెర్సిడెస్ బెంజ్ ఎస్.క్లాస్​ను బ‌హుమానంగా ఇచ్చింది. అదంటే చాలా ఇష్టం.

ఇది చదవండి: క్రికెటర్​ శ్రీశాంత్​తో హన్సిక ప్రేమాయణం​..!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
CHANNEL 10 – NO ACCESS AUSTRALIA
Brisbane – 13 November 2019
1. Lawyer for the father of one of Cardinal George Pell's victims, Lisa Flynn, at news conference
2. SOUNDBITE (English) Lisa Flynn, lawyer for the father of one of Cardinal George Pell's victims:
"I have spoken to our client this morning, he's expressed that he is extremely disappointed with the High Court's decision to allow Pell leave to appeal the conviction. He was really hopeful that this would be over for him today because as the process goes on and has gone on for some time, it is extremely re-traumatizing for him, it remains very raw. He describes sleepless nights in the lead-up to days like this."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Lisa Flynn, lawyer for the father of one of Cardinal George Pell's victims:
"It's exactly that. It's an emotional rollercoaster that our client has been on and there has been some high points in that when the jury made their unanimous decision to convict Pell but every appeal that is announced by Pell is a downturn in that and it brings up the raw emotions of our clients, it brings, it's re-traumatizing for him as he is forced to again think about what his son endured and the horrible spiral, downward spiral of his son's life following the abuse."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Lisa Flynn, lawyer for the father of one of Cardinal George Pell's victims:
"Pell's decision to continue to appeal the decisions that have been handed down against him and the convictions, even though our client does understand that he has the right to do that, it's extremely re-traumatizing for him and it's also re-traumatizing for a number of survivors and victims all around the world that are closely following this case as well."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The lawyer for the father of one of Cardinal George Pell's victims said her client was "extremely disappointed" after Australia's highest court agreed Wednesday to hear an appeal from the most senior Catholic to be found guilty of sexually abusing children.
Lisa Flynn told reporters in Brisbane that the decision was "extremely re-traumatizing" for her client and other victims.
The decision gives Cardinal George Pell his last chance at getting his convictions overturned.
The decision by the High Court of Australia comes nearly a year after a unanimous jury found Pope Francis' former finance minister guilty of molesting two 13-year-old choirboys in Melbourne's St Patrick's Cathedral in the late 1990s, shortly after Pell became archbishop of Australia's second-largest city.
The 78-year-old was sentenced to six years in prison in March and is no longer a member of Francis' Council of Cardinals or a Vatican official.
The Victoria state Court of Appeal rejected his appeal in August.
Pell is in a Melbourne prison, where a newspaper reported last month that he had been given a gardening job.
He did not attend the High Court in Canberra to hear the decision Wednesday.
The father, who cannot be named, intends to sue the church over his son's abuse.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.