ETV Bharat / sitara

'గులాబి' సంగీత దర్శకుడికి గుండెపోటు - సంగీత దర్శకుడు శశి ప్రీతమ్​కు గుండెపోటు

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్​కు గుండెపోటు రావడం వల్ల సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

'గులాబి' సంగీత దర్శకుడికి గుండెపోటు
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్​
author img

By

Published : Jun 5, 2020, 5:45 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో గురువారం, ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమచారం.

Music composer Shashi Preetam
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్

జేడీ చక్రవర్తి-మహేశ్వరిల 'గులాబి' సినిమాతో సంగీతం దర్శకుడిగా అరంగేట్రం చేశారు శశి ప్రీతమ్. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తీసిన 'సముద్రం' చిత్రానికి స్వరాలు సమకూరుస్తూనే గీతాలను ఆలపించారు. హిందీలో 'ఆమ్దానీ అత్తాణ్ని ఖార్చా రూపియ్య'తో పాటు ఇళయారాజా తనయుడు కార్తిక్‌ రాజాతో కలిసి 'ముఖ్బీర్‌' చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.