ETV Bharat / sitara

భర్తతో కలిసి మొక్కలు నాటిన మెగా డాటర్​ - గ్రీన్​ఇండియా ఛాలెంజ్​

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను పూర్తిచేశారు మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల. జూబ్లీహిల్స్​లోని తన కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

sush
మెగా డాటర్​
author img

By

Published : Jul 21, 2020, 5:23 PM IST

అనుపమ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తాజాగా ప్రముఖ ఫిట్​నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి విసిరిన హరిత సవాల్​ను మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల స్వీకరించారు. తన భర్త విష్ణు ప్రసాద్​తో కలిసి జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

తన సోదరి శ్రీజ, హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, స్వప్నా దత్ లకు.. సుస్మిత ఈ హరిత సవాల్​ను విసిరారు.

sush
మెగా డాటర్​ సుస్మితా

కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కూడా తన నివాసంలో హైబ్రీడ్ మల్బరీ మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను పూర్తి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్... మొయినాబాద్​లోని వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్​తో పాటు 'ఉప్పెన' చిత్రబృందానికి రవిశంకర్ హరిత సవాల్ విసిరారు.

anupama
అనుపమ

ఇది చూడండి : గ్రీన్ ఛాలెంజ్ : కూతురితో కలిసి మొక్కలు నాటిన మంచు లక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.