ETV Bharat / sitara

జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన శ్యామ్​ సింగరాయ్ బృందం - తెలంగాణ వార్తలు

Shyam Singh Roy team Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాని మొక్కలు నాటారు. హీరోయిన్లు కృతిశెట్టి, సాయి పల్లవితో కలిసి జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరారు.

Shyam Singh Roy team Green India Challenge, green india challenge 2021
శ్యామ్ సింగరాయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, గ్రీన్ ఇండియా 2021
author img

By

Published : Dec 19, 2021, 11:38 AM IST

Shyam Singh Roy team Green India Challenge: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా.... 'శ్యామ్ సింగ రాయ్' బృందం మొక్కలు నాటింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని జీహెచ్​ఎంసీ పార్కులో కథానాయకుడు నానితో పాటు హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, చిత్ర నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని నాని పేర్కొన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యతని... ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని హీరో నాని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ని ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు, రాజకీయ నాయకులు అందరూ ఈ సవాల్​ను స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంతో పర్యావరణంపై ప్రజల్లో ఎంతో అవగాహన కలుగుతోందని నాని పేర్కొన్నారు. ఇందులో భాగస్వామ్యం అయి... మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఈనెల 24న విడుదల

బెంగాలీ కుర్రాడిగా నాచురల్ స్టార్ నాని రెండు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో... ఈనెల 24న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో నాని.. కథానాయికలు సాయిపల్లవి, కృతిశెట్టిలతో కలిసి నటించారు.

ఇదీ చదవండి: కృతిశెట్టితో రొమాన్స్​ గురించి హీరో నాని మాటల్లో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.