ETV Bharat / sitara

చరణ్​తో చిత్రంపై 'జెర్సీ' దర్శకుడి క్లారిటీ - చరణ్​తో గౌతమ్ చిత్రం లేదట

రామ్​చరణ్​తో సినిమాపై స్పందించాడు 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి. తన తదుపరి చిత్రం కోసం ఎవ్వరినీ సంప్రదించలేదని స్పష్టం చేశాడు.

Gowham Tinnanuri cahran
చరణ్, గౌతమ్
author img

By

Published : Apr 11, 2021, 10:33 AM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​తో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా తెరకెక్కించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన గౌతమ్.. ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. తాను ప్రస్తుతం హిందీ 'జెర్సీ' చిత్రంపైనే ఫోకస్ చేసినట్లు వెల్లడించాడు.

"నా కొత్త చిత్రం కోసం ఇప్పటివరకు ఏ హీరోను కలవలేదు. ఎవ్వరికీ కథ చెప్పలేదు. ప్రస్తుతం హిందీ 'జెర్సీ' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా" అని తెలిపాడు గౌతమ్.

ప్రస్తుతం రామ్​చరణ్​ 'ఆర్ఆర్ఆర్' చిత్రం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరో హీరో. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్నాడు చెర్రీ. ఇవి పట్టాలపై ఉండగానే ప్రముఖ దర్శకుడు శంకర్​తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ జులైలో ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.