ETV Bharat / sitara

గోపీచంద్​ కొత్త కబురు.. జోరుగా 'శాకుంతలం' షూటింగ్​ - సమంత శాకుంతలం

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమాల కబుర్లు వచ్చాయి. సమంత 'శాకుంతలం'(Shaakuntalam) షూటింగ్​తో పాటు గోపీచంద్​ మూవీ (Gopichand 30) అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Gopichand's 30th movie With Sriwaas - Shakuntalam Movie Shooting in Progress
గోపీచంద్​-శ్రీవాస్​ హ్యాట్రిక్​ మూవీ.. జోరుగా 'శాకుంతలం' షూటింగ్​
author img

By

Published : Jul 14, 2021, 1:40 PM IST

సమంత(Samantha) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం'(Shaakuntalam) షూటింగ్​ హైదరాబాద్‌లో ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. లాక్‌డౌన్‌ సమయంలోనే ఈ షెడ్యూల్‌ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. సమంతతోపాటు దేవ్‌ మోహన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

గోపీచంద్ కొత్త కబురు

కథానాయకుడు గోపీచంద్​(Gopichand)- దర్శకుడు శ్రీవాస్(Sriwass)​ కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు 'లక్ష్యం', 'లౌఖ్యం' బాక్సాఫీసు వద్ద సూపర్​హిట్లుగా నిలిచాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్​లో ఇప్పుడు హ్యాట్రిక్​ చిత్రానికి రంగం సిద్ధమైంది. గోపీచంద్​ కెరీర్​లో 30వ సినిమాగా(Gopichand 30) రూపొందునున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

Gopichand's 30th movie With Sriwaas - Shakuntalam Movie Shooting in Progress
గోపీచంద్​ కొత్త చిత్రం ప్రకటన

ఇదీ చూడండి.. Ajay Devgn: దేశభక్తి కథ.. మళ్లీ కాసులు కురిపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.