ETV Bharat / sitara

'లౌక్యం'తో 'సాహసం' చేస్తూ 'శౌర్యం' చూపిస్తోన్న హీరో - గోపీచంద్ వార్తలు

హీరోగానే కాక విలన్​గానూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు హీరో గోపీచంద్. 'యజ్ఞం', 'రణం' వంటి సినిమాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'సీటీమార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈరోజు (జూన్ 12) ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక కథనం.

గోపీచంద్
గోపీచంద్
author img

By

Published : Jun 12, 2020, 5:35 AM IST

హీరోగా పరిచయమై.. అనంతరం విలన్​గా భయపెట్టి... మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కుకుని.. యాక్షన్ చిత్రాలతో మాస్​ ప్రేక్షకుల్ని అలరించిన హీరో గోపీచంద్. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో పుట్టినరోజు నేడు.

1979 జూన్ 12న ప్రకాశం జిల్లా టంగుటూరులో జన్మించాడు గోపీచంద్. తండ్రి.. పేరున్న దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి రష్యాలో ఉన్నత చదువులు చదువుకున్నాడు. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను 2013లో వివాహం చేసుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు గోపీచంద్. 2001లో వచ్చిన 'తొలివలపు' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడు. 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి విజయాల్ని అందుకున్నాడు. ఈ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ 'యజ్ఞం' సినిమాతో మళ్లీ హీరోగా మారాడు. 'రణం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. యజ్ఞం, రణం విజయాలతో మాస్​ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు.

యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే నటుడిగా గోపీచంద్​కు​ మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో వినోదాత్మక కథల్లోనూ మెప్పించగలనని కొన్ని చిత్రాలతో నిరూపించాడు. 'ఒక్కడున్నాడు', 'లక్ష్యం', 'శౌర్యం', 'గోలీమార్‌', 'సాహసం', 'లౌక్యం', 'జిల్‌' తదితర చిత్రాలు గోపీచంద్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన ఈ హీరో సినిమా 'చాణక్య' నిరాశపర్చింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే చిత్రం చేస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.