ETV Bharat / sitara

'నన్ను కాదు.. మీరు ఓటేసిన నేతల్ని ప్రశ్నించండి'

కరోనా ఆస్పత్రుల విషయంలో సాయం చేయమని కోరుతూ నటి రేణూ దేశాయ్​కి ఓ నెటిజన్ మెసేజ్ పెట్టాడు. కానీ ఆమె దానికి స్పందించలేదు. దీంతో అతడు రేణుపై విమర్శలు చేశాడు. దీనిపై స్పందించిన ఆ నటి తనని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటూ మండిపడింది.

Renu Desai
రేణూ దేశాయ్​
author img

By

Published : May 21, 2021, 8:55 AM IST

సాయం కోరుతూ తాము చేసిన మెసేజ్​లకు సరైన సమయంలో స్పందించడం లేదంటూ కొంతమంది వ్యక్తులు సందేశాలు పెడుతున్నారని నటి రేణూ దేశాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రేణు కొన్నిరోజుల నుంచి పలువురు కొవిడ్‌ బాధితులకు చేయూతగా నిలుస్తున్నారు.

కాగా, తాజాగా ఓ నెటిజన్‌.. కొవిడ్‌ ఆసుపత్రుల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణుకి మెసేజ్ పెట్టాడు. కాకపోతే ఆమె ఆ సందేశానికి ఏవిధంగానూ స్పందించలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన నెటిజన్‌.. "మేడమ్‌ సాయం చేస్తున్నా అన్నారు. ఎక్కడ చేస్తున్నారండి మీరు.. సాయం. డబ్బున్న వాళ్లనే మీరు పట్టించుకుంటారు కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్లని పట్టించుకోరు" అని సందేశం పంపించాడు. కాగా, నెటిజన్‌ పంపిన సందేశం పట్ల ఆమె అసంతృప్తి చెందారు. తనని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేదని.. కావాలంటే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించమని ఆమె అన్నారు.

"సుమారు 10-12 రోజుల నుంచి నిరంతరంగా కొవిడ్‌ బాధితులకు నాకు చేతనైనంత సాయం చేస్తున్నా. నేను ఏమీ రాజకీయ నాయకురాలినో లేదా మీరు ఎన్నుకున్న నేతనో కాదు.. మీరు నన్ను ప్రశ్నించడానికి!! మీరు ఎవరికైతే ఓట్లు వేశారో వెళ్లి వాళ్లని ప్రశ్నించండి!! సాయం కోరుతూ కొంతమంది వ్యక్తులు పెడసరి ధోరణితో నాకు మెసేజ్​లు పెడుతున్నారు. వాటి వల్ల కొన్నిసార్లు సాయం చేయాలనే స్ఫూర్తి పోతుంది. ఒకవేళ నేను కనుక మీ మెసేజ్​కు స్పందించకపోతే దయచేసి నాకు మరొకసారి సందేశాన్ని పంపించండి. ఎందుకంటే చేయూతనందించమంటూ నాకు ఎంతోమంది మెసేజ్​లు చేస్తున్నారు. దానివల్ల కొన్నిటిని నేను చూడలేకపోతున్నా" అని రేణు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.