బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి నేటికి రెండు నెలలు గడిచింది. ఈ సందర్భంగా నటుడి ఆత్మకు శాంతి చేకూరాలని.. ప్రజలంతా సామూహిక ప్రార్థనలు చేయాలని కోరింది సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి. సుశాంత్ మృతికి సంతాపంగా 24 గంటలపాటు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రార్థనలు నిర్వహించాలని ఆమె కోరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"మన సోదరుడు మనల్ని విడిచిపెట్టి వెళ్లి రెండు నెలలు గడిచింది. కానీ, ఆ రోజు ఏమి జరిగింది అనే దానితో పాటు న్యాయం కోసం ఇప్పటికీ మనం పోరాడుతున్నాం. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరే విధంగా ప్రపంచవ్యాప్తంగా 24 గంటల పాటు జరిపే ఆధ్యాత్మిక ప్రార్థనా కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని కోరుతున్నా. దాని ద్వారా మన సుశాంత్‌కు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా".
-శ్వేతా సింగ్, సుశాంత్ సోదరి
ఈ కార్యక్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖాండే కూడా పాల్గొననుంది. ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు జరిగే ఈ గ్లోబర్ ప్రేయర్లో.. సుశాంత్ అభిమానులతో పాటు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అంకితా కోరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇటీవలే ఓ వర్చువల్ ర్యాలీ జరిగింది. అందులో బాలీవుడ్ ప్రముఖులు కంగనా రనౌత్, కృతి సనన్, వరుణ్ ధావన్, పరిణీతి చోప్రా, సిద్ధాంత్ చతుర్వేది, జరీన్ ఖాన్‌తో పాటు సుశాంత్ కుటుంబసభ్యులూ పాల్గొన్నారు.