దర్శకుడు రాంగోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం భారీ జరిమానాలు విధించింది. పవర్ స్టార్ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 30కి పైగా పోస్టర్లకు ఆర్జీవీ బృందం ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సినిమా పోస్టర్లు పెట్టడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వక్తం చేసింది. పోస్టర్ల ఏర్పాటుకు అనుమతులు లేని కారణంగా మొత్తం రూ.88 వేల జరిమానా విధించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు.
ఆరు రోజులుగా ఈ జరిమానాలు విధిస్తున్నట్లు విశ్వజిత్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి పోస్టర్లు పెట్టరాదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: