ETV Bharat / sitara

వ్యాఖ్యాతగా సందడి చేయనున్న నటి జెనీలియా - జెనీలియా రితీశ్​ దేశ్​ముఖ్

'లేడీస్ Vs జెంటిల్‌మెన్' అనే డిజిటల్​ షో ద్వారా బాలీవుడ్​ స్టార్​ జోడి రితీశ్​ దేశ్​ముఖ్​, జెనీలియా ప్రేక్షకులను అలరించనున్నారు. చాలా కాలం తర్వాత తన భర్తతో కలిసి ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది జెనీలియా.

Genelia excited to share screen with hubby Riteish again
భర్తతో కలిసి వ్యాఖ్యాతగా చేస్తున్న నటి జెనీలియా
author img

By

Published : Nov 18, 2020, 11:16 AM IST

బాలీవుడ్​ స్టార్​ జోడి రితీశ్​ దేశ్​ముఖ్​, జెనీలియా కలిసి ఓ డిజిటల్​ షోలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి మళ్లీ జట్టుకట్టడం చాలా ఆనందంగా ఉందని జెనీలియా పేర్కొంది.

"చాలా కాలం తర్వాత రితీశ్​తో కలిసి మళ్లీ స్క్రీన్​ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 'లేడీస్ Vs జెంటిల్‌మెన్' కార్యక్రమానికి కొంతమంది సెలెబ్రిటీలు వస్తుంటారు. వారిని ప్రశ్నలు అడిగి పలు అంశాలపై డిబేట్​ చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి. ఇందులో మా వ్యక్తిగత అనుభవాలనూ పంచుకుంటాం".

- జెనీలియా దేశ్​ముఖ్​, హీరోయిన్​

తన భార్యతో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సవాలుతో కూడుకున్నదని రితీశ్​ దేశ్​ముఖ్​ తెలిపాడు. ఈ కార్యక్రమం తనకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నాడు. రోజువారీ విషయాలపై మహిళలు, పురుషుల గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడాన్ని ప్రేక్షకుల కచ్చితంగా ఆసక్తి చూపిస్తారని రితీశ్​ తెలిపాడు.

'లేడీస్ Vs జెంటిల్మెన్' డిజిటల్​ షో ఫ్లిప్​కార్ట్​ వీడియోలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో అడిగే ప్రశ్నలకు వీక్షకులూ సమాధానమిచ్చే వీలుంది. షోలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానానికి విలువైన బహుమతులు గెలుచునే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.