ETV Bharat / sitara

'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​' రిలీజ్​పై క్లారిటీ వచ్చేసింది - మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​ గీతా ఆర్ట్స్​

అఖిల్​ అక్కినేని కొత్త చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​​' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై స్పందించిన చిత్రబృందం.. సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

Geetha Arts 2 clarifies on Most Eligible Bachelor's OTT release
'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​' రిలీజ్​పై క్లారిటీ వచ్చేసింది
author img

By

Published : May 24, 2021, 6:56 PM IST

Updated : May 24, 2021, 7:57 PM IST

అక్కినేని వారసుడు అఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఓ సరికొత్త కథా చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్​లర్‌'. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ ఇటీవలే ప్రచారం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్రబృందం నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాకే రిలీజ్‌ డేట్‌ను మరోసారి ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.

ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అప్పట్లో చిత్రబృందం ప్రకటించింది.

ఇదీ చూడండి.. సల్మాన్​ చిత్రంలో ఉగ్రవాదిగా ఇమ్రాన్​!

Last Updated : May 24, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.