నటి గౌహర్ ఖాన్‌పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కేసు పెట్టారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ ఆమె షూటింగ్‌కు హాజరు కావడమే ఇందుకు కారణం.
ఇటీవల గౌహర్ ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. హోం క్వారంటైన్లో ఉండాలని బీఎమ్సీ అధికారులు ఆమెకు సూచించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్లగా, గౌహర్ షూటింగ్‌కు వెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో ఒసివారా పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు పెట్టారు.
నగర భద్రత విషయంలో రాజీపడే సమస్యే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సదరు నటిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఈ వైరస్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఇది చదవండి: చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్