ETV Bharat / sitara

వెంటాడే 'గతం'... భయపెట్టే వర్తమానం - గతం సినిమా డైరెక్టర్​ ఇంటర్వ్యూ

ఏడుగురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు 26 రోజుల పాటు శ్రమించి తెరకెక్కించిన చిత్రం 'గతం'. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరించారు. నవంబరు 6న అమెజాన్ ​ప్రైమ్​లో విడుదలకానుంది. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'తో చిత్ర దర్శకుడు కిరణ్​ కొండమాడుగుల ముచ్చటించారు.

Gatham movie Director Kiran special interview with ETV Bharat
వెంటాడే 'గతం'... భయపెట్టే వర్తమానం
author img

By

Published : Nov 3, 2020, 5:31 AM IST

'గతం' అమెరికాలో పుట్టిన తెలుగు సినిమా. ఏడుగురు సాఫ్ట్​​వేర్ ఉద్యోగులు 26 రోజులపాటు శ్రమించి తయారు చేసిన థ్రిల్లర్ మూవీ. స్క్రిప్ట్ దగ్గర నుంచి షూటింగ్ వరకు అంతా అగ్రరాజ్యంలోనే పూర్తి చేసుకుని నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్​లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా 'గతం' చిత్ర దర్శకుడు కిరణ్ కొండమాడుగుల అమెరికా నుంచి 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆసక్తికరమైన స్క్రీన్​ప్లే

"గతం' సినిమా రిలీజ్ అవుతుందనే ఆనందం ఒకవైపు... ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ మరోవైపు ఉంది. ఏదేమైనా నా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఫీలింగ్ చాలా బాగుంది. ఇదో కల్పిత కథ. ఈ కథకు ఎక్కడా మూలాలు లేవు. ఏ సినిమా నుంచి కూడా లైన్ తీసుకోలేదు. గతం పోగొట్టుకున్న ఓ వ్యక్తి... వర్తమానంలో మరో వ్యక్తిని కలుసుకుంటాడు. గతంలో వారిద్దరికున్న సంబంధం ఏమిటీ? వాళ్లు శత్రువులా? మిత్రులా? గతం గుర్తొస్తే జరిగే పరిణామాలేంటీ? అనేది చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా సాగుతుంది" అని దర్శకుడు కిరణ్​ వెల్లడించారు.

కొత్త లోకేషన్లలో చిత్రీకరణ

"సినిమా మొత్తం గంటా 41 నిమిషాలుంటుంది. అందులో మొదటి 20 నిమిషాలు చాలా కీలకం. ఆ సమయంలోనే ఏవరేంటీ అనేది తెలుస్తోంది. ఎక్కడ స్టోరీ జరుగుతుంది అనేది చెప్పాను. ఆ తర్వాత అసలు కథకు తొలి అరగంట లింకై ఉంటాయి. ప్రేక్షకుడి దృష్టి మరల్చకుండా కట్టిపడేస్తుంది. సినిమాలోని పాత్రలూ ఆసక్తికరంగా ఉంటాయి. కొత్త నటీనటులు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. తెరపై ఇంతకు ముందెన్నడూ చూడని లొకేషన్స్ కనిపిస్తాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లో షూటింగ్ చేశాం. మొత్తం 26 రోజుల్లో షూటింగ్ పూర్తైంది. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఇంజినీర్లతో సౌండ్ డిజైనింగ్ చేయించాం".

నటీనటులంతా సాఫ్ట్​వేర్​ ఉద్యోగులే

"గతం' సినిమా కథ రాయడానికి ఆరు నెలలు పట్టింది. భారత్​లో షూట్ చేద్దామంటే వీసా సమస్యలు, ఇతరత్రా కారణాలు అడ్డుపడ్డాయి. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా సాఫ్ట్​వేర్ ఉద్యోగులమే. పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. సెలవులు దొరికేవి కావు. కానీ వీలునప్పుడల్లా డెమో షూట్స్ చేయడం, వర్క్ షాప్స్ నిర్వహించాం. అలా బాగా వచ్చిందని అందరం భావించాకే పూర్తి స్థాయిలో సినిమాను చిత్రీకరించాం. మొదటి షెడ్యూల్ 17 రోజులు ప్లాన్ చేసుకున్నాం. రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడ్డాం. ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తోంది. మా క్లైమాక్స్​కు చక్కటి వాతావరణం కావడం వల్ల దట్టమైన మంచులోనే క్లైమాక్స్ తీశాం. సహజంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అడుగు కిందకు వేస్తే కాళ్లు లోపలికి వెళ్లిపోతున్నాయి. అయినా షూటింగ్​ చేశాం. ఆ సన్నివేశాలను తెరపై చూశాక.. "అలా చేసి ఉంటే బాగుండేది" అనే భావన రాకూడదనే ఉద్దేశంతో సహజంగా చిత్రీకరించాల్సి వచ్చింది. రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవి. ఎవరు మంచోళ్లు ఎవరు చెడ్డోళ్లో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించే విధంగా పాత్రలను మలచాం".

ప్రతి ఫ్రేమ్​ అద్భుతంగా ఉంటుంది

"సినిమాలో ప్రతి ఫ్రేమ్​ అద్భుతంగా రావడానికి కారణం మా సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి. తొలుత మా సినిమాకు సినిమాటోగ్రాఫర్ దొరకలేదు. చాలా మందిని సంప్రదించాం. నాకు తెలిసిన ఓ మిత్రుడి ద్వారా లాంచెస్టర్​లో డిప్లమో చేసిన మనోజ్ రెడ్డిని కలిశా. తన ద్వారా గతం సినిమాను చిత్రీకరించగలిగాం. మా సినిమా తర్వాత మనోజ్ ... నాగశౌర్య అశ్వద్ధామ, క్రిష్ కథ అందించిన వెబ్ సిరీస్ మస్తీలకు పనిచేశారు".

మా లాంటి వారిని ప్రోత్సహించండి

"మొదట నా సినిమా థియేటర్​లోనే విడుదల చేయాలనుకున్నాను. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఓటీటీల వల్ల జనాలు సినిమా చూసే అభిరుచి మారింది. తెలుగు వాళ్లు హాలీవుడ్ సినిమాలతోపాటు తమిళ, మలయాళ సినిమాలూ చూస్తున్నారు. 10 మందిలో కనీసం ఏడుగురికి ఇతర భాషల్లో ఎలాంటి సినిమాలొచ్చాయి, ఏవి బాగున్నాయి, ఏవీ బాగాలేవు అనేది తెలిసిపోయింది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నాం. మీకు సినిమా నచ్చితే పది మందికి చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. వాళ్లతోపాటు మాకూ చెప్పండి. ఎందుకు నచ్చలేదో మీం తెలుసుకుంటాం. ఇంకా బెటర్ అవడానికి ట్రై చేస్తాం. మీరు వేరేవాళ్లకు చెప్పడం వల్ల మాకు జరిగే మేలుతోపాటు 10 మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్​కు మేలు చేసినవాళ్లవుతారు. ఎందుకంటే కొత్త కంటెట్ రావాలని కోరుకునే ప్రేక్షకుల్లో మీరు ఒకరు. సినిమాలో ఏం లేదురా, బోర్ కొడుతుందనే మాట రాకుండా ఉండాలంటే కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చేలా ప్రోత్సహించండి".

ఇండిపెండెంట్​ చిత్రమిది

"అమెరికాలో తీసిన ఇండిపెండెంట్ సినిమా ఇది. యూనిట్​లోని ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతతో పనిచేశారు. ఈ సినిమా హిట్టు అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే భవిష్యత్​లో ఒకరిని నమ్మి డబ్బు పెట్టాలంటే నా సినిమా ఉదాహారణగా నిలవాలి. మేం సక్సెస్ అయితే మరో 10 మందికి ఉపయోగపడుతుంది. అందుకే చాలా బాధ్యతాయుతంగా సినిమా చేశాం" అని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కిరణ్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.