ETV Bharat / sitara

కాఫీ కప్​ మరువక ముందే చేయి కనిపించింది..! - jaime

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ చివరి సీజన్​ ఐదో ఎపిసోడ్​లో జెమీలానిస్టర్​ కుడి చేయి కనిపించింది. లేని చేయి ఉన్నట్టు చూపించడం కారణంగా నెటిజన్లు ఈ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు.

గేమ్ ఆఫ్​ థ్రోన్స్​
author img

By

Published : May 14, 2019, 6:40 PM IST

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​లో చివరిదైన ఎనిమిదో సీజన్​లో తప్పులు వెతికే పనిలో ఉన్నారు నెటిజన్లు. నాలుగో ఎపిసోడ్​లో కాఫీ కప్​ను మరువక ముందే ఐదో ఎపిసోడ్​లో మరో పొరపాటును కనిపెట్టారు. సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్​లో జెమీ లానిస్టర్​, సెర్సీ లానిస్టర్​ కౌగిలించుకునే సన్నివేశముంటుంది. ఇందులో జెమీ లానిస్టర్ కుడిచేయి కనిపించింది. నిజానికి అతడికి కుడి చేయి ఉండదు. ప్రస్తుతం ఈ సన్నివేశం వైరల్​ అవుతోంది.

జెమీ లానిస్టర్ కుడి చేతిని మూడో సీజన్​లోనే కోల్పోతాడు. అప్పటినుంచి బంగారంతో చేసిన చేతిని వాడుతుంటాడు. కానీ చివరిసీజన్ ఐదో ఎపిసోడ్​లో కుడి చేయి కనిపించేసరికి నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. "జెమీకి తన చేయి తిరిగొచ్చింది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నాలుగో ఎపిసోడ్​లో వందల ఏళ్లనాటి కథలో నేటి తరానికి చెందిన కాఫీ కప్​ కనిపించింది. ఈ అంశంపై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. చివరి సీజన్​లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్​లు రాగా.. వచ్చే సోమవారం ప్రసారమయ్యే ఆరో ఎపిసోడ్​తో గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ సిరీస్​కు శుభం కార్డు పడనుంది. 2011లో తొలి సీజన్​ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

New Delhi, May 14 (ANI): While addressing people in Varanasi, through video message on Tuesday, Prime Minister Narendra Modi issued an emotional message for the people of the constituency and said, "Kashi is not two letters for me, it is an inspiration to me. Kashi is on a new path of development." PM modi is contesting again from Varanasi in the ongoing LS polls. The constituency will go to polls in the last phase.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.